తెలంగాణ

telangana

అన్న కుటుంబాన్ని హతమార్చిన తమ్ముడు

By

Published : Apr 12, 2022, 11:06 PM IST

Man Kills Five Of Elder Brothers Family: ఒడిశాలో అమానవీయ ఘటన జరిగింది. ఓ వ్యక్తి తన సొంత అన్న కుటుంబం మొత్తాన్ని హత్య చేశాడు. ముగ్గురు పిల్లలతో సహా నిందితుడు తన అన్న, వదినను పదునైన ఆయుధంతో కిరాతకంగా హతమార్చాడు. అనంతరం పోలీసుల ముందు లొంగిపోయాడు.

Man Killed elder broter family
సోదరుని కుటుంబాన్ని హత్య చేసిన వ్యక్తి

Man Kills Five Of Elder Brothers Family:ఒడిశాలోని కటక్​లో దారుణం జరిగింది. ఓ వ్యక్తి తన అన్న కుటుంబంలో ముగ్గురు పిల్లలతో సహా ఐదుగుర్ని హత్య చేశాడు. మహంగా పోలీస్​ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. నిందితున్ని సిబు సాహుగా గుర్తించారు పోలీసులు. సోమవారం రాత్రి నిందితుడు అతని అన్న ఇంటికి వెళ్లాడు. కుటుంబ వివాదాల కారణంగా అన్న కుటుంబం పట్ల కోపాన్ని పెంచుకున్న నిందితుడు వారిని పదునైన ఆయుధంతో దాడి చేశాడు. నిందితుడు తన అన్న, వదిన, ముగ్గురు పిల్లల్ని హత్య చేశాడు.

హత్య అనంతరం బలిచంద్రాపుర్ పోలీసులకు లొంగిపోయాడు. కుటుంబ వివాదాల కారణంగానే ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసుల ముందు నిందితుడు అంగీకరించాడు. అందుకు సంబంధించిన ఓ వీడియోను కూడా విడుదల చేశాడు.

ఇదీ చదవండి:అమ్మాయిల గ్యాంగ్​వార్​.. నడిరోడ్డుపై జుట్లు పీక్కొని ఫైటింగ్​..

ABOUT THE AUTHOR

...view details