తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కుటుంబాన్ని కాపాడేందుకు చిరుతతో పోరు - చిరుత హత్య

కర్ణాటకలో ఓ కుటుంబంపై చిరుత దాడి చేసింది. ఎలాగైనా తన కుటుంబ సభ్యులను కాపాడుకునేందుకు ఆ మృగంతో వీరోచిత పోరాటం చేశాడు ఓ వ్యక్తి. ఈ క్రమంలోనే తీవ్ర గాయాలపాలయ్యాడు. చివరకు చిరుతను అంతం చేశాడు.

Man kills Cheetah to save his life
కర్ణాటకలో చిరుతపులిని చంపేసిన వ్యక్తి

By

Published : Feb 23, 2021, 7:06 AM IST

కర్ణాటకలోని హసన్ జిల్లా బెండకెరేలో సోమవారం ఓ కుటుంబంపై చిరుతపులి దాడి చేసింది. దీంతో తమ ప్రాణాలు కాపాడుకునేందుకు చిరుతతో వీరోచిత పోరాటం చేశాడు ఓ వ్యక్తి. చివరకు ఆ మృగాన్ని అంతం చేశాడు. ఈ క్రమంలో తీవ్రంగా గాయపడ్డాడు.

కర్ణాటకలో చిరుతపులిని చంపేసిన వ్యక్తి

భార్య, కూతురితో రాజగోపాల్ ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా చిరుత ఒక్కసారిగా ఎదురొచ్చింది. దీంతో బండితో సహా వారు కిందపడ్డారు. వెంటనే పులి వారిపై దాడి చేసింది. ప్రతిఘటించిన రాజగోపాల్.. తమ ప్రాణాలు కాపాడుకోవటానికి చిరుతను చంపేశాడు.

చనిపోయిన చిరుత

సోమవారం ఉదయం కూడా ఓ తల్లి, కుమారునిపై దాడి చేసింది చిరుత. ఈ ఘటనలో వారు తీవ్రంగా గాయపడ్డారు. కాగా రాజగోపాల్​ కుటుంబంపై దాడి సాయంత్రం జరిగింది. ఆత్మరక్షణ కోసమే అతను చిరుతను చంపాల్సి వచ్చిందని పోలీసులకు స్థానికులు తెలిపారు.

ఇదీ చూడండి:'అసోంకు మోదీ ఒక వలస పక్షి'

ABOUT THE AUTHOR

...view details