కర్ణాటక మైసూరుకు చెందిన ఆయుబ్ అహ్మద్ అనే వ్యక్తి 22 సంవత్సరాలలో 16,000 శవాలకు అంత్యక్రియలు నిర్వహించాడు. కరోనా మృతులకు కూడా మున్సిపాలిటీతో కలిసి దహన సంస్కారాలు జరుపుతున్నాడు.
మూడో తరగతి వరకే చదువుకున్న ఆయుబ్.. మారుతి వ్యాన్ను నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఈటీవీ భారత్తో మాట్లాడిన అతడు.. కరోనా మొదటి దశను ప్రజలు లెక్కచేయలేదని, రెండో దశలోనూ వైరస్ వేగంగా వ్యాపిస్తున్నా సీరియస్గా తీసుకోవట్లేదన్నాడు.