తూర్పు దిల్లీలోని ఓ మున్సిపల్ పాఠశాలలో ఇటీవల ఇద్దరు విద్యార్ధినులపై ఓ వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన పట్ల దిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ) తీవ్రంగా స్పందించింది. తరగతి గదిలోకి ప్రవేశించి బాలికలపై వేధింపులకు దిగడమే కాకుండా.. వారి ముందే మూత్ర విసర్జన చేయడం సహించరానిదని మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ విషయాన్ని ప్రిన్సిపల్, తరగతి టీచర్ దృష్టికి విద్యార్థినులు తీసుకెళ్లగా.. మౌనంగా ఉండాలంటూ వారు చెప్పడం ఆక్షేపణీయమని డీసీడబ్ల్యూ పేర్కొంది.
క్లాస్ రూంలోనే విద్యార్థినులపై లైంగిక వేధింపులు.. వారి ముందే మూత్ర విసర్జన!
తరగతి గదిలోనే విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు ఓ కీచకుడు! వారి ముందే మూత్ర విసర్జన చేశాడు!! దిల్లీలోని ఓ మున్సిపల్ పాఠశాలలో జరిగిన ఈ దారుణ ఘటనను దిల్లీ మహిళా కమిషన్ తీవ్రంగా పరిగణించింది. పోలీసులు, మున్సిపల్ కార్పొరేషన్‌కు నోటీసులు జారీ చేసింది.
దీనిపై పోలీసులు, తూర్పూ దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌కు (ఈడీఎంసీ) నోటీసులు జారీ చేసింది. నిందితుడిపై తక్షణం చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అంతేకాకుండా పాఠశాల ఆవరణలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించింది.
భజన్‌పురాలోని అయిదో తరగతి వరకు నిర్వహించే మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలలో జరిగిన ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. విద్యార్థినులు ఇచ్చిన వివరాల ప్రకారం నిందితుడి కోసం గాలిస్తున్నట్లు పోలీసు అధికారులు పేర్కొన్నారు. ఏప్రిల్ 30న ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.
ఇదీ చూడండి:మైనర్‌పై అత్యాచారం.. పోలీసు స్టేషన్ గదిలోకి తీసుకెళ్లి..