బహిరంగ మార్కెట్లో విక్రయించే కొవిడ్ టీకాలను జనౌషధి పథకం ద్వారా సరసమైన ధరలకే అందుబాటులోకి తేవాలని కేంద్ర ప్రభుత్వాన్ని భారతీయ వైద్య సంఘం(ఐఎంఏ) కోరింది. 18 ఏళ్లు దాటిన వారికి టీకాలను ఉచితంగా పంపిణీ చేయాలని సూచించింది. కరోనా మహమ్మారిని కట్టడి చేయడం ద్వారా సాధించే ఆర్థిక లాభాల కంటే.. 18 ఏళ్లు దాటినవారికి టీకా పంపిణీ చేయడానికి అయ్యే ఖర్చు చాలా తక్కువేననని చెప్పింది. అందరికీ టీకాలు పంపిణీ చేయడం ప్రభుత్వ బాధ్యతే అని పేర్కొంది.
"కరోనా మహమ్మారిని కట్టడి చేయడం ద్వారా సాధించే లాభాల కంటే..18 ఏళ్లు దాటిన వారికి టీకా వేసేందుకు అయ్యే ఖర్చు తక్కువే. సీరం ఇన్స్టిట్యూట్ తమ టీకాకు రూ.600గా ధర నిర్ణయించడం విస్మయానికి గురి చేసింది. టీకా ధరల విషయంలో పారదర్శకత పాటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. 18 ఏళ్లు దాటిని వారందరికీ టీకా ఉచితంగా పంపిణీ చేసేలా చర్యలు చేపట్టాలి. బహిరంగ మార్కెట్లో విక్రయించే వ్యాక్సిన్లను జనౌషధి పథకం ద్వారా అందుబాటులోకి తేవాలి."
-ఐఎంఏ