తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అప్పటివరకు పెళ్లిలో సరదా సరదాగా.. కాసేపటికే ఆరుగురు శవాలై... - చెట్టును ఢీకొట్టిన జీపు

Road Accident in Mysore: కర్ణాటకలోని మైసూర్​ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఓ వివాహ వేడుకకు హాజరై తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు.

Major road accident near Mysore
చెట్టును ఢీకొట్టిన బొలెరో

By

Published : Apr 20, 2022, 6:15 PM IST

Updated : Apr 20, 2022, 6:46 PM IST

Road Accident in Mysore: కర్ణాటకలోని మైసూర్​ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హన్సుర్​ తాలుకాలోని కాల్​బెట్టా రోడ్డులో వెళ్తున్న ఓ బొలెరో వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హన్సుర్​ తాలుక ఆసుపత్రికి తరలించారు.

మృతులు కొడగు జిల్లాలోని పలిబెట్టాకు చెందిన అనిల్​, సంతోష్​, వినుత్​, రాజేశ్​, దయానంద్​, బాబుగా గుర్తించారు. ఓ వివాహ వేడుకకు హాజరై హన్సుర్​కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.

చెట్టును ఢీకొట్టిన బొలెరో
Last Updated : Apr 20, 2022, 6:46 PM IST

ABOUT THE AUTHOR

...view details