తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కార్​ షోరూమ్​లో అవమానం.. దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన రైతు..'స్నేహం కోసం' రిపీట్​!

Mahindra salesman mocks farmer: మహీంద్రా షోరూమ్​లో కారు కొనేందుకు వెళ్లిన ఓ రైతును అక్కడి సేల్స్​మ్యాన్ అవమానించాడు. కారు ధర రూ.10 కాదంటూ హేళనగా మాట్లాడాడు. అయితే.. తనను అవమానించిన షోరూమ్​ సిబ్బందికి దిమ్మతిరిగే షాక్​ ఇచ్చారు రైతు.

Mahindra car showroom
రైతును అవమానించిన మహీంద్రా షోరూమ్​ సేల్స్​మ్యాన్

By

Published : Jan 23, 2022, 3:46 PM IST

Updated : Jan 23, 2022, 6:13 PM IST

కార్​ షోరూమ్​లో రైతును అవమానించిన సేల్స్​మ్యాన్​

Mahindra salesman mocks farmer: స్నేహం కోసం సినిమాలో పంచకట్టులో.. చిరంజీవి, విజయ్​ కుమార్​ కలిసి ఓ కార్ల షోరూమ్​కు వెళ్లగా వారిని చూసి అక్కడి మేనేజర్​ అవమానిస్తాడు. ఆ తర్వాత.. గోనె సంచిలో నుంచి డబ్బుల కట్టలు తీయగా ఆశ్చర్యానికి గురై తన తప్పును తెలుసుకుని కారును విక్రయిస్తాడు. ఇలాంటి సీనే కర్ణాటకలోని ఓ మహీంద్రా షోరూమ్​లో జరిగింది. మహీంద్రా బొలెరో కొనేందుకు ఓ రైతు షోరూమ్​కు వెళ్లగా.. అక్కడి సేల్స్​మ్యాన్​ అవమానించాడు.

ఏం జరిగింది?

కర్ణాటక, తుముకూర్​లోని ఓ మహీంద్రా కార్ల షోరూమ్​కు కెంపెగౌడ అనే రైతు తన స్నేహితులతో కలిసి బొలెరో పికప్​ ట్రక్కు కొనేందుకు వెళ్లారు. లోపలకు వెళ్లిన క్రమంలో వారి వస్త్రాలంకరణను హేళన చేస్తూ అక్కడి సేల్స్​మ్యాన్​ అవమానించాడు. కారు ధర మీరనుకున్నట్లు రూ.10 కాదంటూ వారిని తక్కువ చేసి మాట్లాడాడు. ఈ సంఘటన మొత్తం అక్కడే ఉన్న ఒకరు రికార్డు చేశారు. రైతును ఉద్దేశిస్తూ సేల్స్​మ్యాన్ అసభ్యకరంగా​ మాట్లాడుతున్నట్లు వీడియోలో ఉంది.

" షోరూమ్​కు వెళ్లగా మాతో సేల్స్​మ్యాన్​ అవమానకరంగా మాట్లాడాడు. రూ.10కి వచ్చే కారు కాదంటూ హేళన చేశాడు. కారు కొనేందుకు ఇంత మంది రారని మా స్నేహితులను ఉద్దేశించి మాట్లాడాడు."

- కెంపెగౌడ, రైతు

గంటలో రూ.10 లక్షలు..

తమ వస్త్రధారణ చూసి అవమానించిన సేల్స్​మ్యాన్​కు రైతు.. ధీటైన సమాధానమిచ్చారు. గంటలో రూ.10 లక్షలు తీసుకొచ్చి వెంటనే కారు డెలివరీ చేయాలని డిమాండ్​ చేశారు. రైతు చేసిన ప్రతీకార చర్యతో షాక్​కు గురైన షోరూమ్​ సిబ్బంది.. మూడు రోజుల్లో కారు డెలివరీ చేస్తామని రైతుకు, ఆయన స్నేహితులకు తెలిపారు.

అక్కడి నుంచి వెళ్లిన రైతు.. తుముకూర్​లోని తిలక్​నగర్​ పోలీస్​ స్టేషన్​లో షోరూమ్​ సిబ్బందిపై ఫిర్యాదు చేశారు. చివరకు షోరూమ్​ సేల్స్​మ్యాన్​, ఇతర ఉద్యోగులు కెంపెగౌడకు క్షమాపణలు చెప్పారు. రాతపూర్వక క్షమాపణ పత్రాన్ని అందించారు. అనంతరం ఇరువర్గాలతో మాట్లాడిన పోలీసులు.. వివాదానికి ముగింపు పలికారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి:వృద్ధ యాచకులపై కానిస్టేబుల్ దాడి- వీడియో వైరల్​!

Last Updated : Jan 23, 2022, 6:13 PM IST

ABOUT THE AUTHOR

...view details