తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పసిడితో ప్రత్యేక 'స్వీట్లు'- ధరెంతో తెలుసా?

ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో మిఠాయి పేరుగాంచినట్టు.. మహారాష్ట్రలో ఓ స్వీట్​ షాప్​ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. 24 క్యారెట్ల బంగారు పూతతో అలంకరించిన ఓ ప్రత్యేక మిఠాయిని రూపొందించింది. ఈ స్వీట్​ను కొనుగోలు చేసేందుకు కస్టమర్లు ఆసక్తి చూపిస్తున్నారు. మరి దీని ధరెంతో తెలుసుకుందామా?

By

Published : Nov 13, 2020, 1:31 PM IST

Maharashtra shop selling Rs 7,000 per kilo luxury mithai this Diwali
పసిడితో తయారైన ప్రత్యేక స్వీట్లు- కిలో రూ.7వేలు

పసిడితో ప్రత్యేక 'స్వీట్లు'- ధరెంతో తెలుసా?

ఏ పండగైనా ముందుగా గుర్తొచ్చే వాటిల్లో స్వీట్లు కచ్చితంగా ఉంటాయి. అయితే దంతేరాస్​ నాడు ప్రజలు స్వీట్లతో పాటు బంగారాన్ని కూడా కొనుగోలు చేస్తారు. తాజాగా ఈ రెండింటినీ ఒకే చోటకు తీసుకొచ్చింది మహారాష్ట్రలోని ఓ మిఠాయి దుకాణం. ఈ షాప్​.. 24 క్యారెట్ల బంగారు పూతతో అలంకరించిన ఓ ప్రత్యేక మిఠాయి.. ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తోంది.

'సోనేరి భోగ్​'

అమరావతిలోని రఘువీర్​ స్వీట్​ షాప్​ ఈ ప్రత్యేక మిఠాయిలకు వేదికైంది. 'సోనేరి భోగ్​'గా పిలిచే ఈ లగ్జరీ స్వీట్​లను 24క్యారెట్ల బంగారు పూతతో ప్రత్యేకంగా అలంకరించారు నిర్వాహకులు. అందువల్లే కిలో మిఠాయిని రూ.7000గా విక్రయిస్తున్నట్టు తెలిపారు షాప్​ యజమాని తేజస్​ పోపత్​.

"గతేడాది దీపావళికి బంగారు పూత పూసిన 'పిస్తా పాన్'​తో ముందుకు వచ్చాం. ఈ సీజన్​ సందర్భంగా మరో అడుగు ముందుకేసి.. 24 క్యారెట్ల బంగారుపూతతో కూడిన 'సోనేరి భోగ్​' మిఠాయిలను తయారు చేశాం."

- తేజస్​ పోపత్​, రఘువీర్​ స్వీట్​ షాప్​ యజమాని

ఈ లగ్జరీ మిఠాయిల తయారీలో బాదం, పిస్తా, హేజిల్​నట్​, కుంకుమ పువ్వులను వాడినట్టు పేర్కొన్నారు తేజస్​. ఇక మరింత ప్రత్యేకతను చాటుకునేందుకు స్వచ్ఛమైన పసిడి పూతను పూసినట్టు ఆయన వివరించారు. అంతేకాకుండా.. 'సోనేరీ భోగ్​' స్వీట్​ కొనుగోలుదారులకు బంగారం స్వచ్ఛతకు సంబంధించిన ధ్రువీకరణ పత్రం, గ్రీటింగ్​కార్డులను కూడా ఇస్తామని చెప్పుకొచ్చారు షాప్​ యజమాని.

తగ్గని గిరాకీ..

ఇంతటి భారీ ధర నిర్ణయించినప్పటికీ.. సోనేరి భోగ్​ స్వీట్లను కొనేందుకు అమితాసక్తి కనబరుస్తున్నారు వినియోగదారులు.

"నేను ప్రతి ఏడాది ఈ షాప్​లో స్వీట్లు కొంటాను. వారు ప్రతి సంవత్సరం కొత్తదనం కోసం వినూత్న ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ షాప్​లో లభించే ఏ స్వీట్​ అయినా చాలా బావుంటుంది. అందువల్లే నా కుటుంబం కోసం ఈ సోనేరి భోగ్​లను కొనుగోలు చేస్తున్నాను."

- కొనుగోలుదారుడు

'సోనేరి భోగ్​' మిఠాయిల కోసం ముంబయి, పుణె, నాగ్​పుర్​ వంటి ప్రముఖ నగరాల నుంచి పెద్దయెత్తున ఆర్డర్లు వస్తున్నాయట.

ఇదీ చదవండి:నాజిర్​ బేగ్​.. ఓ నయా ఆదిమానవ్​

ABOUT THE AUTHOR

...view details