తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మహారాష్ట్రలో కరోనా రికార్డు- ఒక్కరోజే 30వేల కేసులు

మహారాష్ట్రలో కరోనా మళ్లీ బీభత్సం సృష్టిస్తోంది. తాజాగా మరో 30 వేల 535 మందికి వైరస్​ సోకింది. ఏడాది కాలంలో నమోదైన కేసుల్లో ఇవే అత్యధికం. మరో 99 మంది వైరస్​ ధాటికి బలయ్యారు. దిల్లీలోనూ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి.

Maharashtra sees 30,535 COVID-19 cases, highest since last March, t
'మహా'లో 30 వేల కేసులు.. ఏడాదిలోనే అత్యధికం

By

Published : Mar 21, 2021, 9:17 PM IST

Updated : Mar 21, 2021, 10:30 PM IST

దేశంలో పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. మహారాష్ట్రలో కొత్తగా.. 30,535 మందికి పాజిటివ్​గా నిర్ధరణ అయింది. గతేడాది మార్చి 1 నుంచి ఇప్పటివరకు నమోదైన కేసుల్లో ఇవే అత్యధికం.

ఈ కేసులతో కలిపి మహారాష్ట్రలో మొత్తం బాధితుల సంఖ్య 24,79,682కు చేరింది. మరో 99 మంది ప్రాణాలు కోల్పోగా మొత్తం మరణాల సంఖ్య 53,399కి పెరిగింది.

మహారాష్ట్రలోని ముంబయి నగరంలో కరోనా వ్యాప్తి ఉద్ధృతంగా కొనసాగుతోంది. కొత్తగా 3,755 మందికి వైరస్​ సోకింది. మరో 10 మంది మరణించారు.

ముంబయిలో కేసులు..

  • మొత్తం కేసులు:3,62,654
  • మొత్తం రికవరీలు: 3,26,708
  • మొత్తం మరణాలు:11,582
  • యాక్టివ్​ కేసులు: 23,448

దిల్లీలో కేసులు..

దిల్లీలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కొత్తగా 823 కేసులు నమోదయ్యాయి. వైరస్ ధాటికి మరొకరు బలయ్యారు.

  • మొత్తం కేసులు: 6,47,984
  • మొత్తం రికవరీలు: 6,33,410
  • మొత్తం మరణాలు: 10,956
  • యాక్టివ్​ కేసులు: 3,618

కేరళ, కర్ణాటక, గుజరాత్​లోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి.

ఇదీ చూడండి:టీకా తీసుకున్నాం.. రక్తదానం ఎప్పుడు చేయొచ్చు?

Last Updated : Mar 21, 2021, 10:30 PM IST

ABOUT THE AUTHOR

...view details