తెలంగాణ

telangana

ETV Bharat / bharat

క్లినిక్​ మాటున శిశు విక్రయాలు- డాక్టర్​ బాగోతం బట్టబయలు.. - మహారాష్ట్రలో శిశు అమ్మకాల వార్త

నవజాత శిశు విక్రయాల బండారాన్ని బట్టబయలు చేశారు మహారాష్ట్ర పోలీసులు. శిశువును అమ్ముతుండగా ఓ వైద్యుడు సహా మరో ముగ్గురు మహిళలను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. క్లినిక్​ పేరుతో ఆ వైద్యుడు చేస్తున్న నిర్వాకాన్ని బయటపెట్టారు.

Selling baby
నిందితులతో పోలీసులు

By

Published : Nov 5, 2021, 7:28 AM IST

Updated : Nov 5, 2021, 7:55 AM IST

మహారాష్ట్ర నవి ముంబయిలో నవజాత శిశు విక్రయాలకు పాల్పడుతున్న ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. ఈ ఘటనలో వైద్యుడు సహా మరో ముగ్గురు మహిళలను అరెస్ట్​ చేశారు. వైద్యుడిని.. నగరంలోని కామోతే ప్రాంతంలో ఫ్యామిలీ హెల్త్​ కేర్​ క్లినిక్​ నడుపుతున్న పంకజ్ పాటిల్​గా అధికారులు గుర్తించారు. ​

ప్రణాళిక ప్రకారమే

కామోతే సెక్టార్​ 8లో క్లినిక్​ మాటున పంకజ్​.. రూ.4 లక్షలకు నవజాత శిశువులను అమ్ముతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఆ వైద్యుడిని పట్టుకునేందుకు పోలీసులు వల పన్నారు. వారి వ్యూహం ప్రకారం నాయక్​ మంథాన్​ పాటిల్​ అనే వ్యక్తి.. శిశువును కొనుగోలు చేసేందుకు పంకజ్​ ఆస్పత్రికి వెళ్లారు. డాక్టర్​ పాటిల్​ డిమాండ్​ చేసిన రూ.4 లక్షల మొత్తాన్ని కూడా తీసుకెళ్లాడు. డబ్బు చూసిన డాక్టర్​.. పసికందును విక్రయించాలని భావించే మహిళలకు ఫోన్​ చేసి క్లినిక్‌కి రమ్మని చెప్పాడు. తలోజాకు చెందిన ముగ్గురు మహిళలు ఆడబిడ్డతో క్లినిక్‌కి వెళ్లారు. ఒప్పందం ప్రకారం.. డాక్టర్​ పాటిల్ వద్ద డబ్బు తీసుకొని శిశువును అప్పగించాడు.

నిందితులతో పోలీసులు

వెంటనే క్లినిక్ వెలుపల తన బృందంతో సిద్ధంగా ఉన్న అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ మహలా.. ఆ ముగ్గురు మహిళలు సహా వైద్యుడిని అరెస్టు చేశారు.

ఇదీ చూడండి:పండగ వేళ అపశ్రుతి- వివిధ ఘటనల్లో పలువురు మృతి

Last Updated : Nov 5, 2021, 7:55 AM IST

ABOUT THE AUTHOR

...view details