తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరోనా కట్టడికి 'మహా'లో 7-పాయింట్ల కార్యచరణ

కొవిడ్​-19 వ్యాప్తిని అరికట్టేందుకు ప్రత్యేక కార్యచరణను రూపొందించింది మహారాష్ట్ర ప్రభుత్వం. టెస్టింగ్​, ట్రేసింగ్​, మరణాలను పర్యవేక్షించడం వంటివి ఇందులో ప్రముఖంగా పేర్కొంది. తక్షణమే ఈ చర్యలు చేపట్టాలని అన్ని జిల్లాల అధికారులను అక్కడి ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు.

Maharashtra forms 7-point action plan to contain spread of COVID-1
కరోనా కట్టడికి 'మహా'లో 7-పాయింట్ల కార్యచరణ

By

Published : Mar 10, 2021, 8:34 PM IST

మహారాష్ట్రలో కరోనా కేసుల పెరుగుదలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది అక్కడి ప్రభుత్వం. ఈ మేరకు 7 పాయింట్ల కార్యచరణ ప్రణాళికను రూపొందించింది ఆరోగ్యశాఖ. కొవిడ్​ సోకిన వారితో సన్నిహితంగా ఉన్నవారికి టెస్టులు చేయడం, వేగవంతమైన కాంటాక్ట్​ ట్రేసింగ్​, వైరస్​ హాట్​స్పాట్​ కేంద్రాల్లో పెద్దఎత్తున పరీక్షలు చేయడం, మరణాలను పర్యవేక్షించడం వంటివి ఇందులో ఉన్నాయి.

మార్చి 3న ప్రభుత్వానికి రాసిన లేఖలో ఈ అంశాలను పేర్కొన్న ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి డాక్టర్​ ప్రదీప్​ వ్యాస్​.. వీటిపై వెంటనే చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల పాలనాధికారులను ఆదేశించారు. సామాజిక, రాజకీయ, మతపరమైన సమావేశాల్లో తప్పనిసరిగా మార్గదర్శకాలను పాటించాలని సూచించారు. ఇందుకోసం ప్రజల్లో అవగాహన కల్పించాలని కార్యచరణలో పేర్కొన్నారు.

ఆ రాష్ట్రంలో ఫిబ్రవరి రెండో వారం నుంచి కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో వైరస్​ వ్యాప్తి అధికంగా ఉన్న నాగ్​పూర్​,అమరావతి, యావత్మల్​, ఠాణె, పుణె, ముంబయిలను కేంద్ర ఆరోగ్య శాఖ బృందం ఇటీవల సందర్శించిన నేపథ్యంలో.. ప్రణాళికలను రూపొందించారు.

'మహా శివరాత్రి' ఆంక్షలు..

కరోనా వ్యాప్తిని అరికట్టే చర్యల్లో భాగంగా.. మహా శివరాత్రి సందర్భంగా ఆలయాల్లో జనాలు గుమిగూడటాన్ని నిషేధించింది ప్రభుత్వం. వేడుకల్లో భాగంగా ఎక్కడా 50 మందికిపైగా సమావేశం కాకూడదని పేర్కొంటూ నూతన మార్గదర్శకాలను బుధవారం విడుదల చేసింది. ఆలయ ప్రాంగణాల్లో ఎప్పటికప్పుడు శానిటైజ్​ చేయడం సహా భక్తులు భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం, కరోనా నిబంధనల్ని తప్పనిసరిగా పాటించేలా చర్యలు చేపట్టాలని నిర్వహకులకు సూచించింది.

ఇదీ చదవండి:రాజధానిలో రామరాజ్యమే నా కల: కేజ్రీవాల్​

ABOUT THE AUTHOR

...view details