మహారాష్ట్ర ముంబయి మంఖుర్డ్ తుక్కు ప్రాంగణంలో చెలరేగిన మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మొత్తం 19 అగ్నిమాపక శకటాలను మోహరించిన సిబ్బంది.. ఎగసిపడుతున్న అగ్నికీలలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
19 అగ్నిమాపక యంత్రాలతో సహాయక చర్యలు - ముంబయి మంఖుర్డ్ అగ్ని ప్రమాదం అప్డేట్స్
మహారాష్ట్రలో శుక్రవారం జరిగిన భారీ అగ్నప్రమాద ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మొత్తం 19 అగ్నిమాపక వాహనాలతో ఉవ్వెత్తున ఎగసిపడుతున్న అగ్నికీలలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు సిబ్బంది.
శుక్రవారం మధ్యహ్నం తుక్కు ప్రాంగణంలో చెలరేగిన మంటలు పక్కనే ఉన్న ఇతర గోదాంలకు అంటుకున్నాయి. ఫలితంగా పెద్దఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగనప్పటికీ.. భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. దట్టమైన పొగలు ఆ ప్రాంతమంతా విస్తరించడం వల్ల.. స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అక్కడ పెద్దఎత్తున నూనె, ఇతర ఆయిల్ పదార్థాలను అనుమతి లేకుండా నిల్వచేస్తున్నారని స్థానికులు ఆరోపించారు. వీటివల్లే తరుచూ అగ్ని ప్రమాదాలు జరుగుతున్నట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి:చక్కా జామ్: భద్రతా వలయంలో దేశ రాజధాని