రిలయన్స్ గ్రూప్ అధినేత ముకేశ్ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్ధాల వాహనం ఉంచిన కేసులో జాతీయ దర్యాప్తు సంస్ధ (ఎన్ఐఏ) కీలక పురోగతి సాధించింది. సంబంధిత వాహన యజమానిగా భావిస్తున్న మన్‌సుఖ్ హిరేన్ అనుమానాస్పదంగా మృతి చెందిన ముంబయిలోని మితి నది నుంచి దర్యాప్తు బృందాలు కీలక ఆధారాలు స్వాధీనం చేసుకున్నాయి.
మన్‌సుఖ్ హిరేన్ మృతి కేసులో కీలక మలుపు - మహారాష్ట్ర సచిన్ వాజే
ముకేశ్ అంబానీ ఇంటి పరిసరాల్లో పేలుడు పదార్థాల కారు యజమానిగా అనుమానిస్తున్న మన్‌సుఖ్ హిరేన్ మృతి కేసు కీలక మలుపు తిరిగింది. మృతదేహం దొరికిన మితి నదిలో గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టిన అధికారులు.. కంప్యూటర్ సీపీయూ, వాహనం నంబర్ ప్లేట్ వంటి కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. మన్‌సుఖ్ మృతి వరకు ఇవన్నీ సచిన్ వాజే కస్టడీలో ఉండేవని అధికారులు పేర్కొన్నారు.
మన్‌సుఖ్ హిరేన్ కేసులో కీలక ఆధారాలు లభ్యం
నదిలో గాలింపు జరిపిన గజ ఈతగాళ్లు కంప్యూటర్ సీపీయూ, ఓ వాహనం నంబర్ ప్లేట్‌ను వెలికి తీశారు. హిరేన్ మృతి వరకు ఇవన్నీ ముంబై మాజీ పోలీసు అధికారి సచిన్ వాజే కస్టడీలో ఉండేవని అధికారులు పేర్కొన్నారు. కేసు దర్యాప్తులో ఇవి కీలకం కాగలవని భావిస్తున్నారు.
ఇదీ చదవండి:విశ్రాంత జడ్జితో 'మహా' హోంమంత్రిపై విచారణ!
Last Updated : Mar 28, 2021, 6:21 PM IST