ప్రస్తుతం ఉన్నట్లుగానే మహారాష్ట్రలో వైరస్ వ్యాప్తి కొనసాగితే లాక్డౌన్ విధించక తప్పదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. రానున్న రోజుల్లో మహారాష్ట్రలో రోజుకు 2.5 లక్షల ఆర్టీ పీసీఆర్ టెస్టులు చేయనున్నట్లు పేర్కొన్నారు.
ఇప్పటివరకు రాష్ట్రంలో 65 లక్షల మందికి టీకా ఇచ్చినట్లు పేర్కొన్న సీఎం.. గురువారం ఒక్కరోజే 3 లక్షల మందికి టీకా వేసినట్లు చెప్పారు. మాస్కు ధరించే విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్న వారికి టీకా తీసుకున్నాక కూడా వైరస్ సోకుతుందని అన్నారు.