తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తులసి పంట వేశారు.. లక్షాధికారులు అయ్యారు!

ఎన్నో జబ్బులను నయం చేయగల తులసి.. ఇప్పుడు రైతుల ఇంట సిరులను పండిస్తోంది. మహారాష్ట్రకు చెందిన కొందరు రైతులు.. తులసి పంటతో ఏడాదికి రూ.1.83 లక్షల వరకు ఆదాయం ఆర్జిస్తున్నారు. ఓ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని సహకార వ్యవసాయం ద్వారా తులసి సాగు చేస్తున్నారు.

By

Published : Jul 26, 2021, 4:08 PM IST

Tulsi cultivation
తులసి సాగు

నీటి వసతి అంతగాలేని పొలాల్లో తులసి మొక్కలు పెంచి.. రూ.లక్షల ఆదాయం ఆర్జిస్తోంది మహారాష్ట్రలోని ఔరంగబాద్​కు చెందిన 16 మంది రైతుల బృందం. బెంగళూరుకు చెందిన ఓ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని ఈ మొక్కలను పెంచుతోంది. ఎకరానికి 15,000 నుంచి 18,000 మొక్కలు వేసి.. రూ.70 వేల నుంచి రూ.1.83 లక్షల ఆదాయాన్ని ఆ రైతులు సంపాదిస్తున్నారు.

జిల్లాలోని పైఠాన్​ తాలుకాలోని కేకత్​ జల్​గావ్​, కుతుబ్​ఖేడా, దవర్వాడి గ్రామాలు మూడేళ్ల క్రితం బెంగళూరుకు చెందిన ఓ ఫార్మాస్యూటికల్​ సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు రైతు సందీప్​ కాక్డే తెలిపారు. అప్పటి నుంచి తులసి సాగు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

"ఎకరానికి 15వేలు నుంచి 18వేలు మొక్కలను వేస్తాం. ఈ మొక్కలను ఏడాదికి మూడు లేదా నాలుగు సార్లు కోసేసి.. పొడిగా చేసి బెంగళూరుకు పంపిస్తాం. తులసిని పెంచడానికి ఎలాంటి ఎరువు, రసాయనాలు అవసరం లేదు. అలాగే తక్కువ నీటితో పండించవచ్చు. ఫలితంగా ఏదేమైనా సంవత్సరానికి రూ.70 వేలు నుంచి రూ.1.83లక్షల ఆదాయం పొందుతున్నాం."

- సందీప్​ కాక్డే, రైతు

తులసి సాగుతో రైతులు మంచి ఆదాయం పొందుతున్నారని పైఠాన్​ తాలుకా వ్యవసాయ అధికారి తెలిపారు. వీరిని ప్రొత్సాహించాల్సిన అవసరముందన్నారు.

ఇదీ చూడండి:'పట్టు'దలతో మహిళల సిరుల పంట

ABOUT THE AUTHOR

...view details