తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బెయిల్​పై బయటికొచ్చి చిన్నారిపై హత్యాచారం - మహారాష్ట్ర లో చిన్నారిపై అత్యాచారం, హత్య

మహారాష్ట్రలో అమానుషం జరిగింది. తల్లిదండ్రుల వద్ద నిద్రిస్తున్న చిన్నారిని ఎత్తుకెళ్లి హత్యాచారం చేశాడు ఓ దుండగుడు. 10 రోజుల క్రితమే అతడు అత్యచారం కేసులో బెయిల్​పై బయటకు వచ్చినట్లు పోలీసులు తెలిపారు.

Maha: Rape accused on bail sexually assaults, kills child
బెయిల్​పై బయటికొచ్చి చిన్నారిపై అత్యాచారం

By

Published : Dec 31, 2020, 8:26 PM IST

దేశవ్యాప్తంగా ఏదో ఒక చోట చిన్నారులు, మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. మహారాష్ట్రలో అలాంటి అమానుష ఘటనే జరిగింది. అత్యాచారం కేసులో బెయిల్​పై వచ్చిన ఓ దుండగుడు మూడేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేశాడు. నిందితుడు ఆదేశ్​ పటేల్​ను అరెస్ట్​ చేసి రిమాండ్​కు తరలించారు పోలీసులు. 10 రోజుల క్రితమే ఓ అత్యాచారం కేసులో బెయిల్​ పొంది బయటకు వచ్చినట్లు తెలపటం గమనార్హం. ఈ ఘటన రాయ్​గఢ్​ జిల్లా, పెన్​ తహసీల్​, వడ్​గావ్​​ గ్రామంలో బుధవారం(డిసెంబర్​30న) జరిగింది.

"బుధవారం(డిసెంబర్​30) తన తల్లిదండ్రుల వద్ద నిద్రిస్తున్న చిన్నారిని ఆదేశ్​ పటేల్​ అనే వ్యక్తి .. పాఠశాల వెనకున్న నిర్మానుష్య ప్రదేశానికి ఎత్తుకెళ్లాడు. ఆపై అత్యాచారం చేసి చంపేశాడు."

-మహారాష్ట్ర పోలీసులు

కనిపించకుండా పోయిన చిన్నారి జాడని ఆమె నాయనమ్మ గుర్తించగా.. వెంటనే చిన్నారిని ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు పోలీసులు. అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధరించారని వెల్లడించారు.

సంఘటనా ప్రాంతంలో పాటిల్​ అనుమానాస్పదంగా తిరుగుతుండటాన్ని గమనించి అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. నిందితుడిని కోర్టులో ప్రవేశ పెట్టగా.. అతనికి జనవరి 8 వరకు పోలీస్​ కస్టడీ విధించింది. అతనిపై ఇదివరకే పలు కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చూడండి:'చిన్నారుల భద్రతకు హామీ ఇవ్వలేకపోతున్నచట్టాలు'

ABOUT THE AUTHOR

...view details