కరోనా రెండోసారి విజృంభిస్తుందనే అంచనాల మధ్య వైరస్ కట్టడికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోందని తెలిపారు మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్. మళ్లీ లాక్డౌన్ విధించే అంశాన్నీ పరిశీలిస్తున్నట్లు చెప్పారు.
"వినాయక చవితి, దీపావళి సమయంలో ఎక్కడ చూసినా భారీగా జనసందోహం కనిపించింది. కరోనా రెండోసారి విజృంభిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. సంబంధిత విభాగాలతో ఎప్పటికప్పుడు చర్చిస్తున్నాం. రానున్న 8-10 రోజుల పాటు పరిస్థితిని సమీక్షించి, లాక్డౌన్పై తగిన నిర్ణయం తీసుకుంటాం" అని తెలిపారు అజిత్.