తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గంజాయి సాగుకు అనుమతి కోసం రైతు దరఖాస్తు - గంజాయి సాగుకోసం రైతు పిటిషన్​

సంప్రదాయ పంటలు వేసి వ్యవసాయంలో నష్టాలు చవిచూసిన ఓ రైతు మహారాష్ట్రలోని సోలాపుర్​ జిల్లా యంత్రాంగానికి వినూత్న రీతిలో పిటిషన్​ పెట్టాడు. ప్రతి ఏడాది వేసే పంటల వల్ల నష్టం వస్తోందని.. అందుకే తన పొలంలో గంజాయి పండించడానికి అనుమతి ఇవ్వాలని కోరాడు. అంతేగాకుండా దీనిపై అధికారులు అల్టిమేటం కూడా ఇచ్చాడు. తాను పేర్కొన్న సమయానికి స్పందన రాకపోతే మరుసటి రోజునే గంజాయి సాగు మొదలుపెడతానని స్పష్టం చేశాడు.

Farmer seeks permission to cultivate ganja
గంజాయి సాగుకు రైతు డిమాండ్​

By

Published : Aug 26, 2021, 6:15 PM IST

మహారాష్ట్ర సోలాపుర్​కు చెందిన అనిల్​ పాటిల్​ అనే రైతు జిల్లా యంత్రాంగానికి పెట్టుకున్న పిటిషన్​ను చూసి అధికారులు అవాక్కయ్యారు. ఏ పంట వేసినా కనీసం ఖర్చులకు కూడా రావడం లేదని... అందుకే మార్కెట్​లో డిమాండ్​ ఉండే గంజాయి పంట సాగు చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరాడు.

"ఏ పంట సాగు చేద్దామన్నా.. దానికి కనీస మద్దతు ధర లభించడం లేదు. వ్యవసాయం నష్టాల్లో కూరుకుపోతోంది. రోజురోజుకు పంట పండించడం కష్టంగా మారుతోంది. ఏ పంట సాగు చేసినా కనీసం పెట్టుబడి డబ్బులు కూడా చేతికి అందడం లేదు. చక్కెర కర్మాగారాలకు అమ్మిన చెరకు డబ్బులు కూడా చేతికి అందడం లేదు. అందుకే మార్కెట్​లో మంచి ధర పలికే గంజాయికి అనుమతి ఇవ్వండి. నాకున్న రెండెకరాల్లో సాగు చేసుకుంటాను."

- పిటిషన్​లో అనిల్​ పాటిల్​, రైతన్న

గంజాయి సాగును నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టన్స్ (ఎన్​డీపీఎస్​) చట్టం కింద ప్రభుత్వం నిషేధం విధించింది.

గంజాయి సాగుకు రైతన్న డెడ్​లైన్​...

పొలంలో గంజాయి సాగుకు సంబంధించి అధికార యంత్రాగానికి డెడ్​లైన్​ విధించాడు ఆ రైతు. సెప్టెంబర్​ 15వ తేదీలోపు అనుమతి ఇవ్వాలని కోరాడు. లేకపోతే తానే అనుమతి లభించినట్లుగా భావించి సెప్టెంబర్​ 16 నుంచి సాగు చేసుకోవాల్సి వస్తుందని స్పష్టం చేశాడు. గంజాయి సాగుకు సంబంధించి తనపై ఏదైనా కేసు నమోదు అయితే దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని పిటిషన్​లో పేర్కొన్నాడు.

పబ్లిసిటీ కోసమే...

అనిల్ పిటిషన్​పై జిల్లా యంత్రాంగం స్పందించింది. ఇది కేవలం పబ్లిసిటీ స్టంట్​గా చెప్పుకొచ్చింది. రైతు పెట్టుకున్న దరఖాస్తును స్థానిక పోలీసులకు పంపింది.

అనిల్ గంజాయి సాగు చేయడానికి పూనుకుంటే.. తప్పనిసరిగా కేసు నమోదు చేయాల్సి ఉంటుందని అధికారులు హెచ్చరించారు.

ఇదీ చూడండి:Narayan Rane news: 'రాణె తల తెస్తే రూ.51 లక్షలు నజరానా'

ABOUT THE AUTHOR

...view details