కొవిడ్-19ను ప్రకృతి విపత్తుగా ప్రకటించాలని కేంద్రానికి మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే లేఖ రాశారు. రాష్ట్ర విపత్తు నిధిని కరోనా బారిన పడిన వారి కోసం ఉపయోగించేందుకు అనుమతించాలని కోరారు.
కేంద్ర విపత్తు చట్టంలో భాగంగానే అన్ని రాష్ట్రాల విపత్తు చట్టాలు(ఎస్డీఆర్ఎఫ్) ఏర్పడ్డాయి. దాంతో ఎస్డీఆర్ఎఫ్ నిధుల్ని వాడుకోవాలంటే కేంద్రం అనుమతి తప్పనిసరి. ఇప్పటి వరకు.. వరదలు, పిడుగులు, భారీ వర్షపాతం వల్ల నష్టపోయిన వారికే రాష్ట్ర విపత్తు నిధుల నుంచి డబ్బులు ఇస్తున్నారు.