12 ఏళ్ల బాలికపై ఓ వృద్ధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని జల్నా జిల్లాలో జరిగింది. నిందితుడిని బద్నాపుర్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతనికి 65 ఏళ్లు ఉంటాయని తెలిపిన పోలీసులు... ఐదుగురు పిల్లలు, మునిమనమళ్లు ఉన్నట్లు పేర్కొన్నారు.
బాధితురాలు మేనమామ ఇంట్లో ఉండేదని పోలీసులు తెలిపారు. ఇంట్లో ఉన్న కోళ్లకు మేత వేస్తుండగా దగ్గరకు వచ్చిన నిందితుడు.. చిన్నారికి కొట్టి దారుణానికి ఒడిగట్టినట్లు వివరించారు. అనంతరం ఊరు వదిలి పారిపోయినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై బాధితురాలు తన మేనమామకు జరిగిన విషయాన్ని వివరించగా.. పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.
నిందితుడు విడుదలయ్యాడు.. బాధితురాలు ప్రాణం విడిచింది
16 ఏళ్ల అత్యాచార బాధితురాలు బలవన్మరణానికి పాల్పడింది. ఇంట్లో ఉండే సీలింగ్‌కు ఉరి వేసుకుని చనిపోయింది. తనపై అత్యాచారం చేసిన నిందితుడు బెయిల్‌పై విడుదల కావడం జీర్ణించుకోలేకపోయిన అమ్మాయి బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌లో జరిగింది.
బాధితురాలు తన తండ్రి, పెంపుడు తల్లి, సోదరునితో కలిసి నాగ్‌పుర్‌లోని జరీపటకలో నివసించేది. అయితే జూన్‌లో ఈ అమ్మాయిపై పెంపుడు తల్లి బంధువు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. నిందితుడ్ని అరెస్ట్ చేశారు. అయితే ఆ వ్యక్తి బెయిల్‌పై విడుదల అయ్యాడు. దీంతో మనస్తాపానికి గురైన అమ్మాయి ఉరివేసుకుని చనిపోయింది.
ఇదీ చూడండి:జైలులో ఆ పాట వినాలని ఖైదీ కోరిక.. చివరకు