దేశంలో పెట్రో, డీజిల్ ధరలు ఆకాశానికి అంటుతున్నాయి. ఈ భారాన్ని తగ్గించుకునేందుకు చాలా మంది ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలు వెతుకుతున్నారు. ఇదే తరహాలో తమిళనాడు మధురైకి చెందిన ధనుష్ అనే విద్యార్థి రూపొందించిన సోలార్ సైకిల్‌కు.. ప్రస్తుతం విశేష స్పందన లభిస్తోంది.
ఈ ఎలక్ట్రిక్ సైకిల్.. పర్యావరణ హితమైనదే కాక ఇంధనాలపై అయ్యే ఖర్చుల భారాన్ని కూడా తగ్గిస్తుంది. సైకిల్‌కు అమర్చిన బ్యాటరీకి సోలార్ ప్యానెల్స్‌ను కనెక్ట్ చేశాడు ధనుష్. సౌర శక్తి సాయంతో నడితే ఈ సైకిల్‌కు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.
ఈ సైకిల్‌పైన 30-40కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 50 వరకు ప్రయాణించగలదు. బ్యాటరీ దిగిపోయినా 20 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చన్నాడు ధనుష్. దీనిపై కిలోమీటరు ప్రయాణానికి అయ్యే ఖర్చు రూ1.50 మాత్రమే. దీనిని బైక్గానూ, సైకిల్గాను కూడా ఉపయోగించుకోవచ్చు.