మూడో దశ కరోనా విజృంభించవచ్చన్న హెచ్చరికల నేపథ్యంలో టీకా పంపిణీ కార్యక్రమాన్ని వేగవంతం చేసింది మధ్యప్రదేశ్ ప్రభుత్వం. ఈ ప్రక్రియ గ్రామాల్లోనూ జోరుగా సాగుతోంది. అయితే.. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం అనవసర భయాలతో ప్రజలు టీకాలకు దూరంగా ఉంటున్నారు. మధ్యప్రదేశ్ రాజ్‌గఢ్ జిల్లా పఠాన్ కాలా గ్రామంలో టీకా పంపిణీ సిబ్బందిని చూసిన ఓ వ్యక్తి తన భార్య ఆధార్ కార్డును దాచిపెట్టాడు. అతంటితో ఆగక.. ఆ కార్డును తీసుకుని చెట్టుపైకి ఎక్కి నిలుచున్నాడు.
మొదట ఓకే.. తర్వాత నాట్ ఓకే!
పఠాన్ కాలా గ్రామంలో టీకా పంపిణీపై నిర్వాహకులు గ్రామస్థులకు సమాచారం అందించారు. గ్రామానికి చెందిన కన్వర్లాల్ అనే వ్యక్తితో పాటు.. అతని భార్య టీకా తీసుకునేందుకు సన్నద్ధమయ్యారు. తీరా టీకా కేంద్రానికి చేరుకున్నాక.. తన భార్య ఆధార్ కార్డు తీసుకుని పరుగెత్తి చెట్టు ఎక్కాడు. టీకా తీసుకుంటే జ్వరం వస్తుందని.. అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని పేర్కొన్నాడు. చివరకు అతడు టీకా తీసుకోలేదు, తన భార్యనూ తీసుకోనివ్వలేదు.
ఇదీ చదవండి:'టీకాపై అపోహలు తొలగించండి'