తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భార్యపై అనుమానంతో కాలు, చెయ్యి నరికిన భర్త - భోపాల్​ వార్తలు

భార్యపై అనుమానం పెంచుకున్న ఓ భర్త.. చివరకు ఆమె కాలు, చెయ్యి నరికేశాడు. ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్న ఆమె.. పదిహేను రోజులకోసారి ఇంటికి రావడం సహించలేకే ఈ దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. ఈ ఘటన మధ్యప్రదేశ్​లో జరిగింది.

Madhya Pradesh: Suspecting her character, Husband chops off wife's hand and leg
భార్యపై అనుమానంతో కాలు, చెయ్యి నరికిన భర్త

By

Published : Mar 11, 2021, 10:39 AM IST

మధ్యప్రదేశ్​లో అమానవీయ ఘటన జరిగింది. కట్టుకున్న భార్యపై అనుమానం పెంచుకున్న ఓ భర్త.. కత్తితో ఆమెపై దాడిచేసి కాలు, చెయ్యి నరికేశాడు. ఈ ఘటనలో నిందుతుడిని అదుపులోకి తీసుకున్నట్టు భోపాల్​ ఎస్పీ అనిల్​ త్రిపాఠి తెలిపారు.

ఏం జరిగిందంటే.?

ప్రీతమ్​ రాజ్​పుత్​(28), సంగీత(26) దంపతులు. వీరు భోపాల్​లోని విశ్వకర్మ నగర్​లోనివాసముంటున్నారు. సంగీత ఇందోర్​లోని ఓ ప్రైవేట్​ కంపెనీలో పనిచేస్తూ.. పదిహేను రోజులకోసారి ఇంటికొచ్చేది. ఈ విషయమై అసహనం వ్యక్తం చేసిన రాజ్​పుత్.. ఆమె వారానికోసారి ఇంటికి రావాల్సిందేనని పట్టుబట్టాడు. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి మద్యం సేవించి ఆమెతో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో ఆమె నిద్రిస్తున్న సమయంలో కత్తితో దాడి చేశాడు. ఆమె ఎడమ కాలు, ఎడమ చెయ్యి నరికేశాడు.

విషయం తెలుసుకున్న స్థానికులు.. వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. బాధితురాలిని సమీపంలోని హమిదా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆమెకు శస్త్రచికిత్స నిర్వహించారు అక్కడి వైద్యులు.

సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. రాజ్​పుత్​ను అదుపులోకి తీసుకున్నారు. అతడిపై భారతీయ శిక్షాస్మృతి సెక్షన్​-307(హత్యాయత్నానికి పాల్పడటం) కింద కేసు నమోదు చేసినట్టు పేర్కొన్నారు.

ఇదీ చదవండి:వివాహితకు మద్యం తాగించి.. ఆపై..!

ABOUT THE AUTHOR

...view details