తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మంత్రి కోడలు ఆత్మహత్య! ఆ వ్యవహారమే కారణం!! - PALGHAR NEWS

Minister Daughter in Law Hanging: కుటుంబ కలహాల కారణంగా మధ్యప్రదేశ్​ మంత్రి ఇందర్​ సింగ్​ పర్మార్​ కోడలు ఆత్మహత్య​ చేసుకుంది. మరో ఘటనలో పదే పదే డబ్బులు అడిగాడని.. ఆరేళ్ల బాలుడ్ని గొంతు నులిమి హత్య చేశాడు పోలీస్​ హెడ్​ కానిస్టేబుల్​.

By

Published : May 11, 2022, 11:16 AM IST

Minister Daughter in Law Hanging: మధ్యప్రదేశ్​ విద్యాశాఖ మంత్రి ఇందర్​ సింగ్​ పర్మార్​ కోడలు ఆత్మహత్య చేసుకుంది. షాజాపుర్​ జిల్లా పొంచానేర్​ గ్రామంలోని తన నివాసంలో ఉరి వేసుకుని చనిపోయింది 22 ఏళ్ల సవితా పర్మార్​. మంగళవారం జరిగిందీ ఘటన. కుటుంబ సమస్యల కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. పోలీసులు ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. ఇందర్​ సింగ్​ కుమారుడు దేవ్​రాజ్​ సింగ్​ను మూడేళ్ల క్రితం వివాహం చేసుకుంది సవిత.

బాలుడ్ని చంపిన పోలీస్​:మధ్యప్రదేశ్​ దతియా జిల్లాలో దారుణం జరిగింది. పదే పదే డబ్బులు అడిగాడని.. ఓ ఆరేళ్ల బాలుడ్ని గొంతు నులిమి హత్య చేశాడు పోలీస్​ హెడ్​ కానిస్టేబుల్​. అతడి మృతదేహాన్ని కారులో 70 కి.మీ. దూరం తీసుకెళ్లి.. గ్వాలియర్​లోని నిర్జన ప్రదేశంలో పడేశాడు. ఈ ఘటన గత గురువారం జరగ్గా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా తాను డిప్రెషన్​లో ఉన్నానని, బాలుడు పదే పదే డబ్బులు అడిగేసరికి కోపంతా చంపినట్లు నిందితుడు రవి శర్మ ఒప్పుకున్నాడు.

  • దగ్గరి బంధువైన ఓ మహిళను(55) చంపి వ్యక్తి పరారైన ఘటన మహారాష్ట్ర పాల్ఘర్​లో జరిగింది. నల్లాసొపొరా ప్రాంతంలో మంగళవారం సాయంత్రం ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. నిందితుడు నర్సునాయక్​ కోసం గాలిస్తున్నారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
  • మదర్సాలో ఆరేళ్ల బాలికపై అత్యాచారానికి సంబంధించి ఓ వ్యక్తికి జీవిత ఖైదు విధించింది రాజస్థాన్​ కోటాలోని పోక్సో కోర్టు. రూ. లక్ష జరిమానా కూడా విధించింది. మదర్సాలో ఉర్దూ చదువుకునేందుకు కోట్సువా గ్రామానికి వచ్చిన బాలికపై.. 2021 నవంబర్​ 13న దారుణానికి ఒడిగట్టాడు అబ్దుల్​ రహీమ్​. దీంతో కోర్టు ఇప్పుడు శిక్ష ఖరారు చేసింది.

ABOUT THE AUTHOR

...view details