మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. కరెంట్ షాక్‌తో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందారు. ఛతర్‌పుర్ జిల్లా, బిజర్వర్లోని మహువాజల గ్రామంలో ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు.
ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి - ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి
11:51 July 11
కరెంట్ షాక్‌తో ఒకే కుటుంబంలో ఆరుగురు మృతి
ఒకరి వెంట మరొకరు..
బాధిత కుటుంబం ఇంట్లో ఓ ట్యాంక్ ఉంది. దానిని శుభ్రం చేయాలని నిశ్చయించుకున్నారు. అయితే.. ట్యాంక్‌కి ఉన్న విద్యుత్తు కనెక్షన్ గమనించని ఇంటి పెద్ద ట్యాంక్‌లోకి దిగాడు. లోపలికి వెళ్లగానే అరుపులు మొదలుపెట్టాడు. ఆయన్ని రక్షించాలని కుటుంబ సభ్యులంతా ఒకరివెంట మరొకరు ట్యాంక్ లోపలికి దిగి మృతి చెందారు.
ఈ ఘటనపై సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ దిగ్భాంతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు శాంతి చేకూరాలని ట్వీట్ చేశారు.
ఇదీ చదవండి:దొంగతనం చేశాడని చెట్టుకు వేలాడదీసి.. తీవ్రంగా కొట్టి..