Lunar Eclipse 2023 :ఆకాశంలో మరోసారి అద్భుతం ఆవిష్కృతం కానుంది. ఈ నెలలోనే సూర్యగ్రహణం వచ్చింది. ఇప్పుడు వెంటనే చంద్రగ్రహణం కూడా ఇదే నెలలో కనువిందు చేయనుంది. గ్రహణం అనేది ఆకాశంలో సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే సరళ రేఖపైకి వచ్చినప్పుడు జరిగే ఖగోళ అద్భుతం అని శాస్త్రవేత్తలు చెబుతుంటారు. కానీ.. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహణం చెడుకు సూచనగా భావిస్తారు. ఇవి అశుభమైన ఘడియలుగా పరిగణిస్తారు. గ్రహణ సమయంలో చాలా పనులను చేయకూడదని పురోహితులు చెబుతుంటారు. అంతేకాదు.. ఆ రోజన ఆలయాలను కూడా మూసేస్తారు.
ఈ ఏడాది రెండు ఒకే నెలలో రెండు గ్రహణాలు ఏర్పడడం విశేషం. ఇప్పటికే అక్టోబర్ 14వ తేదీన సూర్యగ్రహణం ఏర్పడింది. ఇప్పుడు ఇదే నెలలో చంద్రగ్రహణం ఏర్పడబోతోంది. మరి, అది ఏ నెలలో ఏర్పడనుంది? మన దేశంలో చంద్ర గ్రహణం కనిపిస్తుందా? అనే విషయాలను ఇప్పుడు చూద్దాం.
Lunar Eclipse 2023 :ఈ నెలలో చంద్ర గ్రహణం.. అక్టోబర్ 28 (శనివారం) అర్ధరాత్రి దాటిన తర్వాత 29వ తేదీ ఆరంభం అవుతుండగా.. ఏర్పడనుంది. ఈ చంద్రగ్రహణం.. భారత్ సహా.. నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్, చైనా, అఫ్ఘాన్ వంటి దేశాల్లో కనిపించనుంది. అయితే.. ఇప్పుడు ఏర్పడేది పాక్షిక చంద్ర గ్రహణం. భారత కాలమానం ప్రకారం ఈ చంద్రగ్రహణం.. అక్టోబర్ 28వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత 01:05 గంటలకు ప్రారంభమై.. 02:24 గంటలకు ముగుస్తుంది.
చంద్రగ్రహణం మన దేశంలో కనిపిస్తుందా?
ఈ పాక్షిక చంద్ర గ్రహాణాన్ని భారతదేశంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ వీక్షించవచ్చు. చంద్రగ్రహణాన్ని ఎలాంటి ప్రత్యేక పరికరాలు అవసరం లేకుండా కూడా చూడవచ్చు. టెలిస్కోప్ పరికరం ఉంటే చంద్రగ్రహణ దృశ్యం మరింత స్పష్టంగా కనిపిస్తుంది.