తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఘనంగా 'ప్రేమికుల జాతర​'.. తరలివచ్చిన లవర్స్​! - వార్తలు

Lover fair in Uttar Pradesh: ప్రేమికుల జాతర గురించి ఎప్పుడైనా విన్నారా? ఉత్తర్​ప్రదేశ్​లోని బాందా నగరంలో ఈ అరుదైన జాతర ప్రతి ఏటా మకర సంక్రాంతికి జరుగుతుంది. రెండు రోజుల పాటు నిర్వహించే ఈ జాతరకు సుదూర ప్రాంతాల నుంచి ప్రేమికులు తరలివస్తారు.

lovers fair
భూరంగఢ్​ కోట వద్ద ప్రేమికుల జాతర

By

Published : Jan 17, 2022, 6:19 PM IST

Updated : Jan 17, 2022, 10:54 PM IST

ప్రేమికుల జాతర​

Lover fair in Uttar Pradesh: మకర సంక్రాంతి సందర్భంగా ఉత్తర్​ప్రదేశ్​లోని బాందా నగరంలో నిర్వహించిన 'ప్రేమికుల జాతర' ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రెండు రోజుల పాటు జరిగిన ఈ ఉత్సవాలకు సుదూర ప్రాంతాల నుంచి వందలాది మంది తరలివచ్చారు. ఇక్కడికి ఎక్కువగా ప్రేమ జంటలు వస్తుంటాయి. ఈ ప్రాంతంలో నిర్మించిన నట్​బాలీ బాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ప్రేమికులు. తమ కోరికను బాబాతో చెప్పుకుంటే.. తప్పకుండా నెరవేరుతుందనేది వారి నమ్మకం. వందల ఏళ్ల నుంచి మకర సంక్రాంతి రోజున ఈ ప్రేమికుల జాతరను నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

భూరంగఢ్​ కోట వద్ద ప్రేమికుల జాతర

బాందా నగరంలోని కేన్​ నది ఒడ్డున ఉన్న భురాగఢ్​ కోటలో రెండు రోజుల పాటు ఈ ప్రేమికుల జాతర వైభవంగా జరుగుతుంది. కోట ప్రాకారాల కింద నిర్మించిన నట్​బాలీ బాబా ఆలయం ప్రజల విశ్వాసానికి ప్రతీకగా ఉంది.

నట్​బాలీ బాబా ఆలయంలో రద్దీ

ఇదీ కథ..

600 ఏళ్ల క్రితం మహోబా జిల్లాలోని సుగిరా ప్రాంతానికి చెందిన నోనే అర్జున్​ సింగ్​ అనే రాజు.. భురాగఢ్​​ ప్రాంతాన్ని పాలించేవారు. మధ్యప్రదేశ్​, సారాబాయి ప్రాంతంలోని నట్​ సమాజానికి చెందిన బీరన్​ అనే 21 ఏళ్ల యువకుడు ఆ కోటలో సేవకుడిగా ఉండేవాడు. మంత్రతంత్రాలతో పాటు అన్నీ రంగాల్లో అపార నైపుణ్యం అతని సొంతం. ఈ క్రమంలోనే రాజు కూతురు బీరన్​ను ప్రేమించింది. బీరన్​ను పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకుని తండ్రికి తెలపగా.. తన కుమార్తెకు ఓ షరతు విధించారు రాజు అర్జున్​ సింగ్​. కేన్​ నదికి అవతలివైపు ఉన్న బాంబేశ్వర్​ పర్వతంపైన కోట నుంచి భురాగఢ్​ కోట వరకు నదిపైన తాడు సాయంతో బీరన్​ రాగలిగితే.. అతనికి ఇచ్చి వివాహం చేస్తానని చెప్పారు. అలాగే.. తన అర్ధరాజ్యాన్ని ఇస్తానని హామీ ఇచ్చారు.

ప్రేమికుల జాతరలో సందడి

ఈ షరతును అంగీకరించిన బీరన్​.. నదికి అవతలి వైపు ఉన్న బాంబేశ్వర్​ కోట నుంచి మరోవైపు ఉన్న కోటలోకి తాడు ద్వారా వచ్చే ప్రయత్నం చేశాడు. ఈ పందెం గెలిచే అవకాశం ఉందని తెలుసుకున్న రాజు.. తాడుని తెగ్గొట్టేస్తారు. దీంతో తాడు తెగిపోయి బీరన్​ కోట ప్రకారాలపై పడి మరణిస్తాడు. ఈ విషయం తెలుసుకున్న రాజు కుమార్తె.. కోటపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటుంది.

వీరి ప్రేమకు చిహ్నంగా ఆ ప్రాంతంలో వారి సమాధు​లను నిర్మించారు. అనంతరం వాటి పైన గుడి కట్టారు. నాటి నుంచి మకర సంక్రాంతి రోజున స్థానికులతో పాటు ఇతర ప్రాంతాలకు చెందినవారు ఇక్కడికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.

ఇదీ చూడండి:జల్లికట్టు జోరు- బసవన్నలతో యువకుల పోరు

Last Updated : Jan 17, 2022, 10:54 PM IST

ABOUT THE AUTHOR

...view details