ప్రియురాలికి లవ్ లెటర్ ఇచ్చేందుకు వెళ్లిన ఓ యువకుడు.. పొరపాటున పక్కింట్లోకి దూరాడు. యజమాని రాకను గమనించిన ఆ యువకుడు అక్కడి నుంచి పారిపోయేందుకు డాబా మీదకు పరిగెత్తాడు. డాబాపై ఉన్న వాటర్ ట్యాంక్లో దాక్కొన్నాడు. ఇన్ని తంటాలు పడ్డా.. చివరకు యజమానికి పట్టుబడ్డాడు. బిహార్.. రోహ్తాస్‌లోని బిక్రమ్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది. యువకుడిని పట్టుకొని స్థానికులు చితకబాదారు. కర్రలతో తీవ్రంగా కొట్టారు.
అనంతరం యువకుడిని పోలీసులకు అప్పగించారు. నిందితుడు వర్నా గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. మొదట పక్కింట్లోని అమ్మాయికి లెటర్ ఇవ్వడానికి వచ్చానని యువకుడు చెప్పాడు. కానీ, పొరపాటున ఈ ఇంట్లోకి ప్రవేశించానని పోలీసులకు తెలిపాడు. అందువల్లే భయంతో పారిపోయానని వెల్లడించాడు.