లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కుమార్తె అంజలి.. సివిల్ సర్వీసెస్‌కు ఎంపికయ్యారు. దిల్లీ రాంజాస్ కళాశాలో రాజనీతి శాస్త్రం పూర్తి చేసిన అంజిలి.. తొలి ప్రయత్నంలోనే సివిల్ సర్వీసెస్‌కు ఎంపిక కావడం విశేషం.
"నేను సివిల్స్‌కు ఎంపికవడం చాలా ఆనందంగా ఉంది. మా నాన్నలానే సమాజానికి, దేశ ప్రజలకు నా వంతుగా సేవ చేయలనే ఉద్దేశంతో ఈ సర్వీసులో చేరాలనుకుంటున్నాను."
- అంజలి
తాను సివిల్స్‌కు ఎంపిక కావడానికి చార్టర్డ్ అకౌంటెట్ అయిన తన సోదరి ఆకాన్షా కారణమని.. పరీక్షలకు సన్నద్ధం కావడానికి ఎంతో సాయం చేశారని అంజలి తెలిపారు.
2019లో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్ష ఫలితాలను ఆగస్టు 4న విడుదల చేశారు అధికారులు. రిజర్వు లిస్టులోని 829 మంది అభ్యర్థులకు తాజాగా ఇంటర్వ్యూ నిర్వహించింది యూపీఎస్సీ. ఇందులో అంజలితో పాటు 89మంది ఎంపికయ్యారు.
ఇదీ చూడండి:ఫిబ్రవరి తొలి వారంలోనే కాంగ్రెస్‌కు కొత్త సారథి