తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రెండోరోజూ పెగాసస్​ రగడ - గురువారానికి లోక్​సభ వాయిదా

లోక్​సభలో పెగాసస్ వ్యవహారంపై చర్చకు పట్టుబడుతూ విపక్షాలు ఆందోళన చేయడం వల్ల పార్లమెంట్​ వర్షాకాల సమావేశాలు రెండో రోజూ వాయిదాల పర్వం కొనసాగింది. ఎలాంటి కార్యకలాపాలు సాగించకుండానే దిగువ సభ గురువారానికి వాయిదా పడింది.

Lok Sabha
లోక్​సభ

By

Published : Jul 20, 2021, 3:44 PM IST

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో రెండోరోజూ లోక్​సభ ఎలాంటి కార్యకలాపాలు సాగకుండానే వాయిదా పడింది.​ పెగాసస్ వ్యవహారంపై చర్చకు పట్టుబడుతూ విపక్షాలు ఆందోళన చేశారు. దీంతో సభ ప్రారంభమైన నిమిషాల వ్యవధిలోనే వాయిదా పడింది.

లోక్​సభలో స్పీకర్ వెల్​లోకి దూసుకెళ్లి ప్లకార్డులు ప్రదర్శించారు విపక్ష సభ్యులు. చర్చకు సహకరించాలని స్పీకర్ ఓంబిర్లా వారించినప్పటికీ పరిస్థితి మారకపోవడం వల్ల.. సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైన లోక్​సభలో విపక్ష సభ్యులు ఆందోళనలు కొనసాగించారు. దీంతో సభను మరోసారి మధ్యాహ్నం 3 గంటలకు వాయిదా వేశారు స్పీకర్​.

లోక్​సభ తిరిగి 3 గంటలకు ప్రారంభమవగా.. అప్పుడు కూడా విపక్షాలు ఆందోళన కొనసాగించారు. దీంతో సభను జులై 22కు వాయిదా వేశారు స్పీకర్​.

ఇదీ చూడండి:'కాంగ్రెస్ అసత్యాలను వాస్తవాలతో తిప్పికొట్టండి'

ABOUT THE AUTHOR

...view details