లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై నమోదైన కేసులను ఉపసంహరించుకోనున్నట్లు ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయాన్ని అధికార ప్రతినిధి శనివారం స్పష్టం చేశారు. కేసులను వెనక్కి తీసుకున్న తొలి రాష్ట్రం ఉత్తర్ప్రదేశ్ అని పేర్కొన్నారు.
'ఆ 2.5 లక్షల మందిపై కేసులు ఎత్తేస్తున్నాం' - uttar pradesh
ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లాక్డౌన్ సమయంలో ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై నమోదైన కేసులను ఉపసంహరించుకుంటోంది. ఈ విషయాన్ని అధికార ప్రతినిధి శనివారం స్పష్టం చేశారు.
"2.5 లక్షల మందిపై కేసులు ఉపసంహరణ"
గతేడాది లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించినందుకు ప్రభుత్వం 2.5 లక్షల మందిపై కేసు నమోదు చేసిందని వెల్లడించారు. ఈ నిర్ణయం కోర్టులపై ఒత్తిడిని తగ్గించడమే కాక ప్రజల ఇబ్బందులకు కూడా విముక్తి కలుగుతుందని పేర్కొన్నారు. నెల క్రితం ఇదే విధంగా లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వర్తకులపైన ఉన్న కేసులను ప్రభుత్వం ఉపసంహరించుకుంది.
ఇదీ చదవండి :రికార్డుల్లో చనిపోయి.. 15 ఏళ్లకు మనిషిగా బతికి...