లివ్ ఇన్ రిలేషన్షిప్(సహజీవనం)పై పంజాబ్-హరియాణా హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. నైతికంగా, సామాజికంగా అది ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది. తమకు రక్షణ కల్పించాలంటూ పారిపోయిన ఓ జంట దాఖలు చేసిన పిటిషన్ను పరిశీలించిన న్యాయస్థానం కొట్టివేసింది.
తామిద్దరం కలిసే ఉంటున్నామని, త్వరలో పెళ్లి చేసుకుంటామని ఆ జంట.. పిటిషన్లో పేర్కొంది. అమ్మాయి కుటుంబం నుంచి వారికి ప్రాణహాని ఉందని పిటిషనర్ల తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.
''పిటిషనర్లు తమ లివ్ ఇన్ రిలేషన్షిప్కు ఆమోద ముద్ర కోరుతున్నారు. ఇది నైతికంగా, సామాజికంగా ఆమోదనీయం కాదు. వారికి రక్షణ కల్పించలేం. అందుకే పిటిషన్ను కొట్టివేస్తున్నాం.''