తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఓటీటీల కట్టడికి త్వరలో చర్యలు' - ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో కంటంట్​ నియంత్రణ

ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో వస్తోన్న కంటెంట్​ను నియంత్రించే దిశగా తగిన చర్యలు చేపడుతున్నట్లు సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. స్ట్రీమింగ్ ప్లాట్​ఫామ్​లను నియంత్రించేందుకు ప్రభుత్వం ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్​పై విచారణ సందర్భంగా ఈమేరకు నివేదించింది.

List steps to be taken on regulating OTT content: SC to Centre
'ఓటీటీలకు త్వరలోనే మార్గదర్శకాలు ఇస్తాం'

By

Published : Feb 16, 2021, 4:57 PM IST

నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో వస్తోన్న కంటెంట్​ను నియంత్రించే అంశంపై సమాలోచనలు చేస్తున్నట్లు సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. త్వరలో ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్లు కోర్టుకు విన్నవించింది.

వివిధ ఓటీటీ, స్ట్రీమింగ్, డిజిటల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల కంటెంట్ పర్యవేక్షణ, నిర్వహణ కోసం ప్రభుత్వం బోర్డును ఏర్పాటు చేయాలని న్యాయవాదులు శశాంక్​ శేఖర్​ ఝా, అపూర్వ ఆర్హటియా పిటిషన్​ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్​ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం.. ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో 6 వారాల్లోగా తెలియజేయాలని సూచించింది.

ఇదీ చూడండి: 'ఓటీటీలు స్వీయ నియంత్రణ పాటించాల్సిందే'

ABOUT THE AUTHOR

...view details