తమిళనాడులో ఓ ఇంట్లో చొరబడిన చిరుత.. ముగ్గురిపై దాడిచేసింది. వేలూరు జిల్లా గుడియాత్తం సమీపంలోని కలైపాలయం ఎర్థంగాళ్ వద్ద ఈ ఘటన జరిగింది.
వేలాయుధం కుటుంబం తలుపులు తెరచుకొని ఇంట్లో నిద్రిస్తుండగా.. అర్ధరాత్రి చిరుత ప్రవేశించింది. కోడిని వేటాడుతూ ఇంట్లోకి వచ్చింది. అలికిడికి మేలుకొన్న వేలాయుధం కుటుంబంపై దాడిచేసింది. చాకచక్యంగా ఇంటి నుంచి బయటపడినవారు.. తలుపునకు గడియపెట్టి చిరుతను నిర్బంధించారు. వీరి అరుపులు విన్న స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని.. బాధితులను సమీప ఆసుపత్రికి తరలించారు.