తెలంగాణ

telangana

రైతు ప్రాణాలు రక్షించిన గోమాత.. యజమాని కోసం చిరుతతో ఆవు ఫైట్​

By

Published : Jun 10, 2023, 8:12 AM IST

Updated : Jun 10, 2023, 9:35 AM IST

ఆవు, ఓ పెంపుడు కుక్క తన యజమాని రుణం తీర్చుకున్నాయి. అతన్ని చిరుతపులి బారి నుంచి కాపాడాయి. రైతుపై దాడి చేసిన క్రూర మృగంపై దైర్యంగా పోరాడి.. తమ యజమాని ప్రాణాలను రక్షించాయి. కర్ణాటకలో ఈ ఘటన జరిగింది.

leopard-attacked-on-farmer-in-karnataka-cow-saved-ownerlife-by-fighting-with-a-leopard-dog-also-supported-cow
చిరుతపులితో పోరాడి యజమాని ప్రాణాలను కాపాడిన ఆవు

చిరుత బారి నుంచి యజమాని ప్రాణాలను కాపాడింది ఓ ఆవు. అందుకు ఆ యజమాని పెంపుడు కుక్క కూడా సాయం చేసింది. తమ యజమానిపై దాడి చేసిన చిరుతతో దైర్యంగా పోరాడిన మూగజీవులు.. అక్కడి నుంచి ఆ క్రూర మృగాన్ని తరిమేశాయి. కర్ణాటకలోని దావణగెరె జిల్లాలో ఐదు రోజుల క్రితం జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఇదీ జరిగింది
కరిహలప్ప(58).. చన్నగిరి నియోజకవర్గంలోని ఉబ్రాణి హోబ్లి కొరటికెరె గ్రామానికి చెందిన రైతు. సోమవారం ఓ చిరుత హఠాత్తుగా అతడిపై దాడి చేసింది. అది గమనించిన కరిహలప్ప ఆవు.. వెంటనే చిరుతపై దాడి చేసింది. దాని తన కొమ్ములతో క్రూర మృగాన్ని పొడిచింది. అనంతరం అప్రమత్తమైన ఆ రైతు పెంపుడు కుక్క సైతం.. చిరుత మీదకు దూకి గాయపరిచింది. దీంతో ఆవు, కుక్కకు భయపడ్డ చిరుత.. కరిహలప్పను విడిచి పారిపోయింది.

తన ప్రాణాలు రక్షించిన ఆవుతో రైతు కరిహలప్ప

సోమవారం ఉదయం ఆవును మేపేందుకు పొలానికి వెళ్లిన సమయంలో తనపై చిరుత దాడి చేసిందని కరిహలప్ప తెలిపాడు. తాను పొలం పనుల్లో ఉండగా.. అక్కడికి వచ్చిన చిరుత తనపై మెరుపుదాడి చేసిందని ఆ రైతు వివరించాడు. దీన్ని గమనించిన ఆవు.. తన కొమ్ములతో చిరుతను బలంగా పొడిచిందని, దీంతో ఒక్కసారిగా చిరుత పైకి ఎగిరి నేలపై పడిందని పేర్కొన్నాడు. కిందపడ్డ చిరుతపై కుక్క సైతం దాడి చేసిందని తెలిపాడు. "చిరుత నా ముందుకు వచ్చి నిలుచుంది. అనంతరం నా మీదకు దూకింది. ఇక నా ప్రాణాలు పోతాయని భావించాను. కానీ గౌరి(ఆవు) నన్ను బతికించింది. ఆవు, కుక్క రెండు కలిసి ఆ క్రూర మృగంతో పోరాడి.. దాన్ని అక్కడి నుంచి తరిమేశాయి. " అని కరిహలప్ప తెలిపారు.

చాలా కాలంగా ఈ ప్రాంతంలో చిరుతల బెడద ఎక్కువగా ఉందని.. స్థానికులు చెబుతున్నారు. ఊర్లోని కుక్కలపై చిరుతలు దాడి చేస్తున్నాయని వారు తెలిపారు. తమపై కూడా దాడికి పాల్పడే ప్రమాదం ఉందని అక్కడి వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటవీ అధికారులకు ఫిర్యాదు చేసిన వారు పట్టించుకోవడం లేదని.. స్థానికులు మండిపడుతున్నారు.

పొలంలో పనిచేస్తున్న రైతుపై చిరుత దాడి​ ​
కొద్ది రోజుల క్రితం ఉత్తర్​ప్రదేశ్​లో పొలంలో పని చేస్తున్న ఓ రైతుకు ఊహించని ఘటన ఎదురైంది. అకస్మాత్తుగా వచ్చిన ఓ చిరుత అతడిపై దాడి చేసింది. సమీపంలోనే ఉన్న రైతు కుమార్తె అప్రమత్తమై ధైర్యాన్ని ప్రదర్శించి కర్రతో చిరుతను తరిమికొట్టింది. ఆ తర్వాత చిరుత పారిపోయింది. ఘటన అనంతరం వెంటనే రైతును దగ్గరలోని ఆస్పత్రికి స్థానికులు తరలించారు. వీడియో కోసం ఇక్కడ క్లిక్​ చేయండి

Last Updated : Jun 10, 2023, 9:35 AM IST

TAGGED:

ABOUT THE AUTHOR

...view details