Pandit Birju Maharaj Demise: పద్మవిభూషణ్ గ్రహిత, ప్రముఖ కథక్ కళాకారుడు పండిట్ బిర్జూ మహరాజ్(83) తుది శ్వాస విడిచారు. దిల్లీలోని తన నివాసంలో ఆదివారం అర్థరాత్రి కన్నుమూశారు. ఈ మేరకు ఆయన మనవడు స్వరాన్ష్ మిశ్ర తెలిపారు. దేశ, విదేశాల్లో అనేక నృత్య ప్రదర్శనలు ఇచ్చి.. ఎంతో గుర్తింపు పొందారు.
కొన్ని బాలీవుడ్ చిత్రాలకు కొరియోగ్రాఫర్‌గా బిర్జూ పని చేశారు. దేవదాస్, బాజీరావు మస్తానీ చిత్రాల్లోని పలు పాటలకు ఆయన నృత్యరీతులను సమకూర్చారు.
బిర్జూ మహారాజ్‌ను 1986లో పద్మ విభూషణ్ పురస్కారం వరించింది. కళాశ్రమం పేరుతో దిల్లీలో నృత్య పాఠశాల స్థాపించారు.
మహారాజ్ మృతిపై పలువురు సంతారం తెలిపారు. ఆయన మృతి నాట్య రంగానికి తీరని లోటని ప్రముఖ గాయకుడు అడ్నాన్ సామి అన్నారు. తన కళతో ఎంతో మందిని ప్రభావితం చేశారని కొనియాడారు.
ప్రధాని సంతాపం:
పండిట్ బిర్జూ మహరాజ్ మృతి పట్ల ప్రధాని నరేంద్రమోదీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కథక్ కళకు ఎనలేని సేవ చేశారని కొనియాడారు. భారతీయ నృత్య కళకు ప్రపంచ వ్యాప్తంగా అద్వితీయమైన గుర్తింపును అందించిన వ్యక్తి పండిట్ బిర్జూ మహరాజ్ జీ అని మోదీ కొనియాడారు. ఆయన మరణం యావత్ కళాప్రపంచానికి తీరని లోటని ట్వీట్ చేశారు.
ఇదీ చదవండి:రాజస్థాన్ 'అల్వార్ రేప్ కేసు' సీబీఐ చేతికి..!