పశ్చిమ్ బంగా కోల్కతాలోని ఎస్ల్పేనేడ్ ప్రాంతంలో వామపక్ష కార్యకర్తలు, పోలీసుల మధ్య ఘర్షణ చెలరేగింది. ఉద్యోగాల కోసం డిమాండ్ చేస్తూ రాష్ట్ర సచివాలయానికి ర్యాలీ చేపట్టిన వామపక్షాలకు చెందిన విద్యార్థి, యువజన సంఘాలపై పోలీసులు జలఫిరంగులు ప్రయోగించినట్లు తెలుస్తోంది.
తొలుత నిరసనకారులు.. మమతా బెనర్జీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బారికేడ్లను తొలగించి ముందుకెళ్లే ప్రయత్నం చేశారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు వాటర్ కెనాన్లు, బాష్పవాయువును ప్రయోగించారు.