తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశద్రోహ చట్టాన్ని పునరుద్ధరించాలన్న లా కమిషన్.. తీవ్రస్థాయిలో మండిపడ్డ కాంగ్రెస్ - రాజద్రోహ చట్టంపై కాంగ్రెస్​ వ్యాఖ్యలు

Law Commission Report Sedition : దేశద్రోహ చట్టం సెక్షన్ 124ఏను పునరుద్ధరించాలని లా కమిషన్​ తేల్చి చెప్పింది ఈ మేరకు కేంద్రానికి నివేదిక సమర్పించింది. దీనిపై కాంగ్రెస్​ తీవ్ర స్థాయిలో మండిపడింది. ప్రతిపక్షాలను అణిచివేసేందుకే బీజేపీ ప్రభుత్వం చట్టాన్ని మరింత క్రూరంగా మారుస్తుందని ఆరోపించింది. ఆ వివరాలు..

Sedition Law Commission Report
Sedition Law Commission Report

By

Published : Jun 2, 2023, 9:59 PM IST

Updated : Jun 2, 2023, 10:14 PM IST

Sedition Law Commission Report : దేశద్రోహ చట్టానికి సంబంధించిన భారతీయ శిక్షాస్మృతి (ఇండియన్ పీనల్ కోడ్)లోని సెక్షన్ 124 ఏని పునరుద్ధరించాలని లా కమిషన్ కేంద్రానికి తేల్చిచెప్పింది. అయితే కొన్ని సవరణలు చేయడం ద్వారా ఈ సెక్షన్‌పై మరింత స్పష్టత రావాల్సి ఉందని అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ మేరకు 22వ లా కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ రీతూ రాజ్‌ అవస్థి నేతృత్వంలోని కమిటీ కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్‌వాల్‌కు ఓ నివేదిక సమర్పించింది.

Law Commission Report Sedition : 'సెక్షన్ 124 దుర్వినియోగాన్ని నిరోధించడానికి కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను రూపొందించాలి. సీఆర్‌పీసీలోని సెక్షన్‌ 154కు 1973 నాటి క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌లోని సెక్షన్‌ 196(3) నిబంధనను అవసరాన్ని బట్టి చేర్చాలి. దీంతో సెక్షన్‌ 124ఏ కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసే సమయంలో జాగ్రత్తలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సెక్షన్‌ దుర్వినియోగం అవుతుందనే కారణంతో మొత్తంగా దాన్ని రద్దు చేయాలనుకోవడం తగినది కాదు. ఉపా(చట్టవిరుద్ధ కార్యకలాపాలు (నివారణ)), జాతీయ భద్రతా చట్టాలు సెక్షన్‌ 124ఏ కింద నమోదు చేసే అన్ని కేసులకూ సరిపోవు. దీని కారణంగా 124ఏ చట్టం లేకుంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా హింసను ప్రేరేపించే కేసుల్లో మరింత కఠినమైన తీవ్రవాద చట్టాలను ప్రయోగించాల్సి వస్తుంది. అయితే ఆయా దేశాల్లోని వాస్తవ పరిస్థితుల ఆధారంగా అక్కడి న్యాయ వ్యవస్థలు పనిచేస్తాయి. కొన్ని దేశాల్లో ఇలాంటి సెక్షన్లను రద్దు చేశారని చెప్పి మన దేశంలోనూ అలాగే గుడ్డిగా అనుసరించలేం. 124ఏ సెక్షన్‌ను సవాలు చేయడం వల్ల సుప్రీంకోర్టు దానిని పక్కనబెట్టింది. ఇండిపెండెన్స్​ మూమెంట్​లో పాల్గొన్న సమరయోధులపై అప్పట్లో బ్రిటిష్‌ ప్రభుత్వం ఈ చట్టం కింద కేసులు పెట్టినందని.. అందుకే ఇప్పుడు ఆ చట్టాలు అవసరం లేదని అంటున్నారు. కానీ పరిస్థితులను గమనిస్తే మన న్యాయ వ్యవస్థ నిర్మాణం మొత్తం వలసవాదం పైనే ఆధారపడినదే. అలాంటి వలసవాదాన్ని బూచిగా చూపించి ఈ సెక్షన్‌ను రద్దుచేయాలని కోరడం సబబు కాదు. ఇదొక్కటే కాదు.. ఇలాంటి పలు చట్టాలను ఎన్నోసార్లు దుర్వినియోగం చేసిన సందర్భాలున్నాయి. అలాంటి వాటిలో కొన్నింటిని అత్యున్నత న్యాయస్థానం కూడా గుర్తించింది. అందుకే కొన్నిసార్లు దుర్వినియోగం జరిగిందని రద్దు చేయాలని అనుకోవడం సమంజసం కాదు. దుర్వినియోగం కాకుండా జాగ్రత్తలు తీసుకుని 124ఏని కొనసాగించడమే ఉత్తమం' అని లా కమిషన్‌ కమిటీ తన నివేదికలో స్పష్టం చేసింది.

కేంద్రం సరైన నిర్ణయం తీసుకుంటుంది : అర్జున్‌ రామ్‌ మేఘ్‌వాల్‌
లా కమిషన్ సర్పించిన నివేదికపై వాటాదారులతో లోతైన చర్చలు జరిపి కేంద్రం సహేతుకమైన నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. అయితే ఈ నివేదికలో పేర్కొన్న అంశాలు ఒప్పించేవే తప్ప కట్టుబడి ఉండేవి కాదని చెప్పారు.

మరింత క్రూరంగా.. బీజేపీ ప్లాన్​ అదే! : కాంగ్రెస్
ఈ విషయంపై కాంగ్రెస్​ ఘాటుగా స్పందించింది. ఈ దేశద్రోహ చట్టాన్ని బీజేపీ ప్రభుత్వం మరింత క్రూరంగా తయారు చేస్తోందని ఆరోపించింది. దీని ద్వారా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్ష నాయకులపై దేశద్రోహ చట్టాన్ని ప్రయోగించే సందేశం ఇస్తోందని మండిపడింది.

Last Updated : Jun 2, 2023, 10:14 PM IST

ABOUT THE AUTHOR

...view details