తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కుటుంబానికి అధికారమా? అది 30ఏళ్ల నాటి మాట' - ప్రొఫెసర్ దీపేశ్ చక్రవర్తితో రాహుల్ సంభాషణ

కుటుంబ రాజకీయాలపై విమర్శల నేపథ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ కుటుంబం నుంచి ప్రధానిగా బాధ్యతలు చేపట్టి 30 ఏళ్లు అవుతోందని గుర్తు చేశారు. చికాగో విశ్వవిద్యాలయ ప్రొఫెసర్​తో జరిగిన లైవ్​ ఛాట్​లో ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.

Rahul Gandhi reaction on dynasty criticism
'మా కుటుంబ సభ్యుడు ప్రధాని అయి 30 ఏళ్లవుతుంది'

By

Published : Feb 13, 2021, 6:33 AM IST

'కుటుంబానికి అధికారమా? అది 30ఏళ్ల నాటి మాట'

కుటుంబ రాజకీయాలపై వెల్లువెత్తుతున్న ఆరోపణలను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తనదైన రీతిలో తిప్పికొట్టారు. తన కుటుంబం నుంచి చివరిసారిగా ఓ వ్యక్తి ప్రధాని పదవి చేపట్టి.. 30ఏళ్లు అయ్యిందన్నారు. మాజీ ప్రధాని కుమారుడిననే భావంతో తన ఆలోచనా దృక్పథాన్ని కోల్పోనని తేల్చిచెప్పారు.

చికాగో విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ దీపేశ్ చక్రవర్తితో లైవ్​ ఛాట్​లో మాట్లాడిన రాహుల్ గాంధీ.. 'ట్రోల్స్' తనకు మార్గనిర్దేశకాలని అన్నారు. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలు ప్రజల కోసం పోరాడుతూ మృతిచెందారని, అది చాలా గర్వంగా అనిపిస్తుందని చెప్పారు. వారి నుంచి చాలా విషయాలు నేర్చుకున్నట్లు వెల్లడించారు.

యూపీఏ ప్రభుత్వం ప్రజాదరణ కోల్పోతోందన్న విమర్శలపై మాట్లాడిన రాహుల్.. భారత్​ వంటి పెద్ద వ్యవస్థల కోసం నిర్దిష్ట కాలంలో ఒక ప్రత్యేక విజన్​ను అందించగలగాలని అన్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు. మోదీ విజన్​ పూర్తిగా విఫలమైందని ఆరోపణలు చేశారు. రానున్న రోజుల్లో అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్​ కొత్త వ్యూహాలు రచించాల్సి ఉందని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:ఉత్తర భారతంలో భూప్రకంపనలు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details