తెలంగాణ

telangana

ETV Bharat / bharat

టొమాటో ఫ్లూ డేంజర్ బెల్స్, 108 మందికి వ్యాధి, చిన్నారులకే ముప్పు - భువనేశ్వర్‌లోని ప్రాంతీయ వైద్య పరిశోధన కేంద్రం

Tomato Flu భారత్​లో మరో వైరస్ కలకలం రేపుతోంది. టొమాటో ఫ్లూ అనే వైరస్ కేరళ, ఒడిశాలలో విజృంభిస్తోంది. ఈ వ్యాధి ఎక్కువగా ఐదేళ్లలోపు పిల్లలకు సోకుతుందని ఓ అధ్యయనం తెలిపింది.

Tomato Flu
టొమాటో ఫ్లూ

By

Published : Aug 20, 2022, 7:38 PM IST

Updated : Aug 20, 2022, 7:43 PM IST

Tomato Flu: భారత్‌లో 'టొమాటో ఫ్లూ' డేంజర్‌ బెల్స్‌ మోగుతున్నాయి. హ్యాండ్, ఫుట్ అండ్ మౌత్ డిసీజ్​గా పిలిచే ఈ వ్యాధి కేరళలో ఇప్పటివరకు 82మంది చిన్నారులకు సోకగా, ఒడిశాలో 26మంది ఈ వ్యాధి బారిన పడ్డారు. కాగా ఇదే విషయాన్ని ప్రముఖ 'ది లాన్సెట్‌' జర్నల్‌ ప్రస్తావించింది. మే 6వ తేదీ నుంచి ఇప్పటివరకు కేరళలో 82మందికి ఈ వ్యాధి సోకిందని, వారంతా ఐదేళ్లలోపు పిల్లలేనని వెల్లడించింది. 'కరోనా నాలుగో వేవ్‌తో సతమతమవుతున్న సమయంలో భారత్‌లోని కేరళలో టొమాటో ఫ్లూ లేదా టొమాటో జ్వరం అనే కొత్త వైరస్‌ పుట్టుకొచ్చింది' అని లాన్సెట్ రెస్పిరేటరీ జర్నల్ పేర్కొంది. కేరళలో ఈ కేసులు పెరుగుతుండడం వల్ల సమీపంలోని తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయని తెలిపింది.

ఒడిశాలోనూ 26 మంది చిన్నారుల్లో (1-9ఏళ్ల లోపువారు) ఈ ఫ్లూను గుర్తించినట్లు భువనేశ్వర్‌లోని ప్రాంతీయ వైద్య పరిశోధన కేంద్రం వివరాలు వెల్లడిస్తున్నాయని ది లాన్సెట్‌ పేర్కొంది. ఈ రెండు రాష్ట్రాల్లో కలిపి మొత్తంగా 108 కేసులు నమోదైనట్లు వెల్లడవుతోంది. కాగా కేరళ, ఒడిశా, తమిళనాడు మినహా మరే రాష్ట్రంలోనూ ఈ కేసులు బయటపడలేదని లాన్సెట్‌ స్పష్టం చేసింది.

పేగు సంబంధిత వ్యాధి కారణంగా సోకే ఈ టొమాటో ఫ్లూ ఓ అంటువ్యాధి. ముఖ్యంగా చిన్నారుల్లోనే ఇది వ్యాపిస్తుంది. వయోజనులకు దీన్ని తట్టుకునే రోగనిరోధక శక్తి ఉండటం వల్ల వారిపై ఈ వ్యాధి ప్రభావం చూపదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. ఈ వ్యాధి సోకిన చిన్నారులకు జ్వరం, నోట్లో పుండ్లు, చేతులు, కాళ్లు, పిరుదులపై దద్దుర్లు వంటి లక్షణాలు ఉంటాయి. శరీరంపై ఎర్రగా నీటి బుడగల్లాగా ఏర్పడి, టొమాటో అంత పరిమాణంలో పెరిగిపోతాయి కాబట్టి ఈ వ్యాధికి 'టొమాటో ఫ్లూ' అని పేరు పెట్టారు.

ఇవీ చదవండి:దొంగ కోసం వెళ్లిన పోలీసులపై రాళ్ల దాడి, పెంపుడు శునకాన్ని వదిలి

ఆస్పత్రి వరండాలోనే మహిళ ప్రసవం, శిశువు మృతి, ఆ నిర్లక్ష్యంతోనే

Last Updated : Aug 20, 2022, 7:43 PM IST

ABOUT THE AUTHOR

...view details