తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'అక్కడ చిన్నారులకు 100 శాతం వ్యాక్సినేషన్'

Lakshadweep: టీనేజర్లకు వంద శాతం టీకా వేసింది లక్షద్వీప్. రాష్ట్రాలు, కేంద్ర పాలితప్రాంతాల్లో ఈ ఘనత సాధించిన తొలి ప్రాంతంగా నిలిచింది.

COVID-19
Vaccination

By

Published : Jan 12, 2022, 5:34 AM IST

Lakshadweep: 15-18 ఏళ్ల వారిలో అర్హులైన చిన్నారులకు 100 శాతం వ్యాక్సినేషన్​ పూర్తిచేసింది లక్షద్వీప్. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ ఘనత సాధించిన తొలి ప్రాంతంగా నిలిచింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్, సెక్రటరీ ఎస్​. అస్గర్​ అలీ మంగళవారం వెల్లడించారు.

కరోనాను అరికట్టేందుకు టీనేజర్లకు టీకా పంపిణీ కార్యక్రమం దేశవ్యాప్తంగా జనవరి 3న ప్రారంభమైంది. అందులో భాగంగా 3492 మంది చిన్నారులకు వారం రోజుల్లోనే టీకా పంపిణీ చేసింది లక్షద్వీప్. అంతేకాకుండా, ఐసీఎంఆర్ నిబంధనల ప్రకారం, ఫ్రంట్​లైన్ వర్కర్స్​, ఆరోగ్య సిబ్బంది, 60 ఏళ్ల పైబడినవారికి బూస్టర్​ డోసులను అందిస్తోంది.

అంతకుముందు.. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్​లైన్​ వర్కర్స్​, 18 ఏళ్ల పైబడినవారికి 100 శాతం టీకా పంపిణీ చేసిన తొలి ప్రాంతంగానూ గుర్తింపు పొందింది లక్షద్వీప్. కరోనా కట్టడికి తగిన జాగ్రత్తలు తీసుకుంటూనే థర్డ్​ వేవ్​ను ఎదుర్కొనడానికి సిద్ధమవుతోంది.

ఇదీ చూడండి:మహారాష్ట్రలో కరోనా విలయం.. ఆ రాష్ట్రాల్లో 20వేలకుపైగా కేసులు

ABOUT THE AUTHOR

...view details