తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కుంభమేళాతో కొవిడ్ వ్యాప్తి మరింత ఉద్ధృతం'

దేశవ్యాప్తంగా కొవిడ్ కేసులు పెరుగుతున్న వేళ.. కుంభమేళా నిర్వహణపై అప్రమత్తమయ్యారు అధికారులు. అయితే.. కేటాయించిన గడువు కంటే తక్కువ సమయంలోనే మేళాను ముగించాలని లేదంటే.. కొవిడ్​ విజృంభిస్తుందని ఓ అధికారి అభిప్రాయపడ్డారు.

kumbh in utharakhand
'కుంభమేళాతో కొవిడ్ వ్యాప్తి మరింత ఉద్ధృతం'

By

Published : Apr 6, 2021, 9:49 PM IST

కుంభమేళాతో కొవిడ్​ వ్యాప్తి మరింత తీవ్రమవుతుందని అభిప్రాయపడ్డారు కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఓ ఉన్నతాధికారి. దేశవ్యాప్తంగా కొవిడ్ ఉద్ధృతి పెరుగుతున్న నేపథ్యంలో పలు ప్రాంతాల్లో కుంభమేళా నిర్వహణ ఎలా అనే దానిపై సోమవారం ఉన్నాతాధికారులు సమావేశమయ్యారు.

"కేటాయించిన సమయం కన్నా ముందుగానే కుంభమేళా ముగించకపోతే కొవిడ్​ వ్యాప్తి మరింత ఎక్కువయ్యే అవకాశముంది."

--ఉన్నతాధికారి.

ఈ నేపథ్యంలో కుంభమేళా నిర్వహణపై పలు సూచనలు చేశారు అధికారులు. టీవీ, రేడియోల ద్వారా ప్రభుత్వం కుంభమేళాకు హాజరయ్యేవారికి పలు సూచనలు ఇవ్వాలని అధికారులు కోరారు.

ఏప్రిల్ 12, 14, 27న మహాకుంభమేళా స్నానాలు జరగనున్నాయి. నాశిక్, హరిద్వార్, ప్రయాగ్​రాజ్, ఉజ్జయిన్ ప్రాంతాల్లో ప్రతి 4 సంవత్సరాలకోసారి ఈ స్నానాలు జరుగుతాయి.

ఇదీ చదవండి:

'హరిద్వార్​ కుంభమేళాకు వెళ్లాలంటే ఇవి పాటించాలి'

కుంభమేళా ఈసారి నెల రోజులే

ABOUT THE AUTHOR

...view details