తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కుంభమేళాలో తగ్గిన భక్తుల రద్దీ

కొవిడ్​-19 ప్రభావం.. ఉత్తరాఖండ్​లో జరుగుతున్న కుంభమేళాపై పడింది. పెరుగుతున్న వైరస్​ కేసుల దృష్ట్యా.. కొవిడ్​ మార్గదర్శకాల్ని కట్టుదిట్టం చేసింది అక్కడి ప్రభుత్వం. ఫలితంగా.. ఆ ప్రభావం భక్తులపై పడుతోంది.

Kumbh Mela witnesses low footfall on first day in Haridwar amid COVID-19 scare
కుంభమేళాలో తగ్గిన భక్తుల రద్దీ

By

Published : Apr 2, 2021, 10:06 AM IST

కరోనా ప్రభావం హరిద్వార్‌లో జరుగుతున్న కుంభమేళాపై కూడా పడింది. దేశవ్యాప్తంగా వైరస్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. కేంద్రం ఆదేశాల మేరకు కొవిడ్‌ నిబంధనలను ఉత్తరాఖండ్‌ సర్కార్‌ కట్టుదిట్టంగా అమలు చేస్తోంది. తప్పనిసరిగా మాస్క్‌లు పెట్టుకోవాలని, భౌతిక దూరం పాటించాలని మైక్‌ల ద్వారా ప్రకటించడం సహా.. ఘాట్ల వద్ద శానిటైజేషన్​‌ స్టేషన్లను ఏర్పాటు చేసింది. ఇంకా.. కుంభమేళా పుణ్య స్నానాలకు వచ్చే భక్తులు 72 గంటలలోపు తీసుకున్న ఆర్​టీ-పీసీఆర్​ నెగెటివ్‌ రిపోర్ట్ సమర్పిస్తే కానీ అనుమతించటం లేదు.

ఇదీ చదవండి:ఘనంగా కుంభమేళా- భక్తుల పుణ్యస్నానాలు

ఇలాంటి కట్టుదిట్టమైన భద్రతా చర్యల నడుమ కుంభమేళాలో తొలిరోజు భక్తుల రద్దీ చాలా తక్కువగా ఉంది. గతంలో ఎప్పుడైనా కుంభమేళా ఘాట్లన్నీ భక్తులతో కిటకిటలాడేవి. ఈసారి అందుకు విరుద్ధమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. చాలా ఘాట్లలో భక్తుల రద్దీ నామమాత్రంగానే ఉంది.

సాధారణంగా కుంభమేళా నాలుగు నెలలపాటు జరిగేది. కానీ, కొవిడ్‌ కారణంగా ఈసారి నెలరోజులకే ముగించాలని ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం నిర్ణయించింది.

ఇదీ చదవండి:డిజిటల్​ మార్కెటింగ్​లో రాణిస్తూ విశేష గుర్తింపు

ABOUT THE AUTHOR

...view details