ఉత్తరాఖండ్ హరిద్వార్‌లో జరిగిన కుంభమేళాకు 70 లక్షల మంది భక్తులు హాజరైనట్లు నిర్వాహకులు వెల్లడించారు. కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉండడం కారణంగా శుక్రవారంతో ముగిస్తున్నట్లు ప్రకటించారు. సాధారణ పరిస్థితుల్లో మూడు నెలలకుపైగా జరిగే కుంభమేళా.. కరోనా భయాల మధ్య ఏప్రిల్ 1న లాంఛనంగా ప్రారంభమైంది.
ముందే ముగిసిన కుంభమేళా- 70 లక్షల మంది హాజరు - కుంభమేళ తాజా సమాచారం
ఉత్తరాఖండ్ హరిద్వార్‌లో జరుగుతున్న కుంభమేళా శుక్రవారంతో ముగిసింది. ఈ కార్యక్రమానికి 70 లక్షల మంది భక్తులు హాజరైనట్లు నిర్వాహకులు తెలిపారు.
'ముందేముగిసిన కుంభమేళ.. 70 లక్షల మంది హాజరు'
కుంభమేళా సందర్భంగా రెండు లక్షల మందికి పరీక్షలు నిర్వహించగా.. వారిలో 2,600 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. కుంభమేళా నిర్వహణ వైరస్ పెరుగుదలకు ఆజ్యం పోసేలా ఉందని భావించి ముగించారు. దేశంలో కరోనా రెండో దశ ఉద్ధృతంగా ఉన్న సమయంలో కుంభమేళా నిర్వహించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి.
ఇదీ చూడండి:కరోనా బాధితులకు అండగా 'ఆదర్శ కుటుంబం'