తెలంగాణ

telangana

ETV Bharat / bharat

KTR, Telangana Election Result 2023 : 'అధికారంలో ఉంటే ఎంత బాధ్యతగా ఉన్నామో - ఓడిపోయినా అంతే బాధ్యతగా ఉంటాం' - తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కేటీఆర్

KTR, Telangana Election Result 2023 : అధికారం ఇస్తే ఎంత బాధ్యతగా వ్యవహరిస్తామో, ఓడిపోతే అంతే బాధ్యతగా ఉంటామని బీఆర్​ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. ఈ ఎదురుదెబ్బలను గుణపాఠంగా తీసుకొని ముందుకు పోతామన్నారు. హైదరాబాద్​లోని తెలంగాణభవన్​లో నిర్వహించిన బీఆర్​ఎస్ సమావేశంలో ఎన్నికల ఫలితాలపై కేటీఆర్ స్పందించారు.

KTR
KTR, Telangana Election Result 2023

By ETV Bharat Telugu Team

Published : Dec 3, 2023, 7:27 PM IST

KTR, Telangana Election Result 2023 : ఈ ఏడాది ఆగస్టులో అభ్యర్థుల ప్రకటన వెలువడిన దగ్గర నుంచి 100 రోజులుగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎంతో కృషి చేశారని బీఆర్​ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చెప్పారు. ఈ ఎన్నికలో ఆశించిన ఫలితం రాలేదని నిరాశ చెందారు. ఎందుకంటే గతంలో కంటే ఎక్కువ మెజారిటీ వస్తుందని అనుకున్నామని అన్నారు. ఓటమికి గల కారణాలను లోతుగా విశ్లేషించి, దానిపై శ్రద్ధ పెడతామని తెలిపారు.

తెలంగాణ ప్రజలు ప్రతిపక్ష హోదా ఇచ్చారని, ఆ బాధ్యతను సరిగా నిర్వహిస్తామని కేటీఆర్ పేర్కొన్నారు. అధికారం ఇస్తే ఎంత బాధ్యతగా ఉన్నామో, ఓడిన తర్వాత కూడా అంతే బాధ్యతగా ఉంటామని తెలిపారు. ఈ ఎదురుదెబ్బను పాఠంగా నేర్చుకుంటామని, అనుకున్నట్లు తెలంగాణ సాధించామని, అధికారంలో మంచి పాలన చేశామని సంతృప్తి ఉందన్నారు.

KTR Reaction to Loss in Telangana Election 2023 : 100 శాతం ప్రజల పక్షాన ప్రజల గొంతుకై నిలుచుని ఉంటామని కేటీఆర్ అన్నారు. ప్రభుత్వ నిర్వహణలో సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు చెప్పారు. కొంత బాధ ఉందని కానీ బంతిలా మళ్లీ వేగంగా తిరిగి వస్తామని భరోసా ఇచ్చారు. ఈసారి ప్రతిపక్షంలో ఉండి గతంలో కంటే ఎక్కువ కష్టపడతామని, రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమని అన్నారు. ప్రజలు కాంగ్రెస్​కు అవకాశం ఇచ్చారని వారికి అభినందనలు తెలియజేస్తున్నట్లు వివరించారు.

"ఈ ఓటమికి నిరాశ చెందాల్సిన అవసరం లేదు. కేసీఆర్ సారథ్యంలో మరింత కష్టపడదాం. 14 ఏళ్లు కష్టపడి తెలంగాణ తెచ్చాం. అలాగే పార్టు వృద్ధికి కృషి చేద్దాం. గెలిచిన బీఆర్​ఎస్​ పార్టీ అభ్యర్థులకు అభినందనలు. ఇప్పటికే కేసీఆర్ సీఎం పదవికి రాజీనామా చేసి గవర్నర్​కు పంపించారు. ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తాం. ప్రజల తీర్పుకు శిరసా వహిస్తాం."- కేటీఆర్, బీఆర్​ఎస్ కార్య నిర్వాహక అధ్యక్షుడు

Telangana Assembly Election 2023 Result :గెలిచిన పార్టీ ప్రజలకు అనుగుణంగా పరిపాలన చేయాలని మాజీ మంత్రి కేటీఆర్ సూచించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటారని ఆశిస్తున్నానన్నారు. ఇప్పుడే కొత్త ప్రభుత్వాన్ని తొందర పెట్టమని, వాళ్లు కుదురుకోవడానికి కాస్త సమయం కేటాయిస్తామన్నారు. హైదరాబాద్, మెదక్ ప్రజలు తమకు అండగా నిలిచారని, కరీంనగర్​లో కూడా రిజల్ట్ బాగానే వచ్చిందన్నారు. కొందరు మంత్రులు అనూహ్యంగా ఓటమి పాలవడం కొంచెం బాధను కలిగించిందని ఆవేదన చెందారు.

ABOUT THE AUTHOR

...view details