KRMB Meeting in Hyderabad : శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో నీటి నిల్వలు తగినంతగా లేనందున వచ్చే ఏడాది వరకు తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని నీటిని పొదుపుగా వాడుకోవాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (KRMB) సూచించింది. రెండు జలాశయాల్లో అందుబాటులో ఉన్న నీటి నుంచి తెలంగాణకు 35, ఆంధ్రపదేశ్‌కు 45 టీఎంసీలు కేటాయించింది. నీటి విడుదలకు సంబంధించి బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశమైంది.
KRMB Advise Two Telugu States use Krishna Water Thrift : కేఆర్ఎంబీ సభ్యకార్యదర్శి రాయిపురే (Raipure)అధ్యక్షతన జరిగిన సమావేశంలో తెలంగాణ నీటిపారుదలశాఖ ఈఎన్సీ మురళీధర్, ఏపీ జలవనరులశాఖ ఈఎన్సీ నారాయణరెడ్డి పాల్గొన్నారు. కృష్ణా బోర్డు ఛైర్మన్ శివ నందన్ కుమార్ కూడా సమావేశంలో ప్రత్యేకంగా హాజరయ్యారు. ఈ ఏడాదిలో సాగు, తాగునీటి అవసరాల కోసం రెండు రాష్ట్రాలు ఇచ్చిన ప్రతిపాదనలపై సమావేశంలో చర్చించారు. ఈ సంవత్సరం వర్షాభావ పరిస్థితుల్లో ఉమ్మడి జలాశయాల్లోకి నీరు అంతగా చేరలేదని, ప్రస్తుతం సాగర్, శ్రీశైలం రెండింటిలో కేవలం 82.78 టీఎంసీలు మాత్రమే వినియోగానికి అందుబాటులో ఉన్నాయని బోర్డు సభ్య కార్యదర్శి రాయిపురే తెలిపారు.
KRMB Meeting : దిల్లీకి చేరిన కృష్ణా జలాల వాటాల పంచాయితీ
రానున్న జూన్, జులై వరకు తాగునీటి అవసరాలు కూడా దృష్టిలో పెట్టుకోవాల్సి ఉందని రాయిపురే అన్నారు. ఈ పరిస్థితుల్లో భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని నీటిని (Krishna Water) పొదుపుగా వినియోగించుకోవాలని రెండు రాష్ట్రాలకు సూచించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న 80 టీఎంసీల నీటిలో అక్టోబర్ నుంచి మే నెల వరకు తెలంగాణకు 35 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్‌కు 45 టీఎంసీలు కేటాయించారు. మిగిలిన 2.788 టీఎంసీలతో పాటు ఇంకా ఏవైనా ప్రవాహాలు వస్తే వాటిని కూడా జూన్, జులై తాగునీటి అవసరాల కోసం నిల్వ చేయాలని.. రెండు ప్రాజెక్టుల్లో కనీస నీటిమట్టం ఉండేలా చూడాలని బోర్డుతెలిపింది.
KRMB Meeting Update : వర్చువల్‌గా కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం.. హాజరుకాని తెలంగాణ ఈఎన్సీ