కోల్కతాలోని శామాప్రసాద్ ముఖర్జీ నౌకాశ్రయం 'యాస్' తుపానును ఎదుర్కొనేందుకు చర్యలు చేపట్టనట్లు అధికారులు తెలిపారు. తుపాను తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. తుపాను ప్రభావం పూర్తిగా పోర్టుపై పడక ముందే ఓడలను డాక్లోకి చేర్చాలని నౌకల యజమానులను కోరినట్లు పోర్టు ఛైర్మన్ వినిత్ కుమార్ వెల్లడించారు. ఇప్పటికే కోల్కతా, హల్దియా పోర్ట్ల వద్ద కంట్రోల్ రూంలను ఏర్పాటు చేసినట్లు వివరించారు.
"మేం పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. సరైన సమయంలో మా కార్యకలాపాలను నిలిపివేస్తాం. కోల్కతా, హల్దియాల వద్ద సీనియర్ అధికారుల సమక్షంలో కంట్రోల్ రూమ్లను మే 21 నుంచి నిర్వహిస్తున్నారు. అత్యవసర పరిస్థితులకు సంబంధించి ఇప్పటికే టగ్బోట్లు, లాంచీలు అందుబాటులో ఉంచాము."