రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత రాజ్యాంగంపై ఆన్లైన్ కోర్సును ప్రారంభించారు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెన్ రిజిజు. ఇది కీలక మైలురాయి అని అభివర్ణించారు. రాజ్యాంగ ఆకాంక్షలు, ఆదర్శాలను విసృతంగా వ్యాప్తి చేయాడానికి ఈ కోర్సు ఎంతో దోహదపడుతుందన్నారు. రాజ్యాంగ సూత్రాలపై అవగాహన కల్పించడం ద్వారా దేశంలోని పౌరులు అధికారం పొందుతారని ఆకాంక్షించారు(online course on Indian Constitution).
తీర్పులు, న్యాయాన్ని కోర్టు రూంల నుంచే వెలువరించాల్సిన అవసరం లేదని సీజేఐకి నేను చెప్పాను. ప్రజల ఇళ్ల వద్దకు, క్షేత్రస్థాయికి న్యాయాన్ని తీసుకెళ్లవచ్చు. మనకూల అనుకుల వాతావరణంలోనే ఉండకుండా బయటకు రావాలి' అని కిరెన్ రిజిజు అన్నారు.