రైతు ఆందోళనలు జరుగుతున్న సింఘు సరిహద్దులో దారుణంగా హత్య జరిగింది. 35 ఏళ్ల వయసున్న ఓ వ్యక్తి చేయిన నరికి, బారికేడ్‌లకు వేలాడదీశారు దుండగులు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
అన్నదాతల నిరసనల ప్రధాన వేదికకు దగ్గరలో ఈ మృతదేహం వేలాడుతూ కనిపించడం కలకలం సృష్టించింది. 'పదునైన ఆయుధంతో శరీరంపై దాడి చేసిన గుర్తులు ఉన్నాయి. ఒక చేతిని మణికట్టు వరకు నరికేశారు' అని పోలీసులు తెలిపారు.
మరోవైపు.. ఆ వ్యక్తి ఓ మత గ్రంథాన్ని అపవిత్రం చేశాడని కొందరు ఆరోపించారు. అయితే ఇది అధికారికంగా నిర్ధరణ కావాల్సి ఉంది.