ప్రస్తుతం ప్రపంచం వేగంగా మారిపోతోంది. మహిళలు తమకు ఉన్న హద్దులు చెరిపేస్తూ ఏ పనినైనా తాము చేయగలమని నిరూపిస్తూ ఔరా అనిపిస్తున్నారు. అలాంటి కోవకే చెందుతుంది కేరళ కొట్టాయంకు చెందిన 18 ఏళ్ల యువతి. బులెట్ బైక్‌లను ప్రొఫెషనల్ మెకానిక్‌లా రిపేర్ చేస్తూ.. అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆమెనే దియా జోసెఫ్.
కొట్టాయంకు చెందిన జోసెఫ్ కూతురే దియా. జోసెఫ్ నగరంలోని రైల్వే స్టేషన్‌కు సమీపంలో ద్విచక్రవాహన మెకానిక్ వర్క్ షాప్ నడిపిస్తున్నారు. తండ్రి చేసే పనిని రోజూ గమనిస్తూ.. బులెట్ బైక్‌లను ఎలా బాగు చేయాలో తెలుసుకుంది. 10వ తరగతిలో ఉన్నప్పుడు వేసవి సెలవుల్లో తండ్రికి సాయం చేస్తూ.. రిపేరింగ్‌లో పూర్తి పట్టు సాధించింది. ప్రస్తుతం.. బైకులకు ఆయిల్ మార్చటం, ఇతర సాధారణ రిపేర్లు వంటివి చేస్తోంది. ఈ క్రమంలోనే బులెట్ నడపటమూ నేర్చేసుకుంది దియా.